* ద్వారంపూడి కోసం రంగంలోకి నాదెండ్ల
* అక్రమ రేషన్ బియ్యం తరలింపులో ఇరుక్కున్న ద్వారంపూడి
* ద్వారంపూడి అనుచరుల ఇండ్ల ద్వంసం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రెడ్ బుక్ రాజకీయాలు...జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ తీసుకువచ్చిన ఈ బుక్ లో... పేరున్న వారిని.... కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, లాంటి నేతలే కాకుండా... ఈ లిస్టులో ద్వారంపూడి చంద్రశేఖర్  కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎక్కడ చూసినా.. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు.

రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని తెలుగుదేశం కూటమి... బయటకు తీసి ద్వారంపూడి చంద్రశేఖర్ను టార్గెట్ చేస్తోంది. అయితే అధికారంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు... కాకినాడలో జనసేన పార్టీ నాయకులను బాగా తొక్కేశారు ద్వారంపూడి చంద్రశేఖర్. అక్కడ  జనసేన నాయకులను ఒక ఆట ఆడుకున్నారట. చంద్రబాబు కుటుంబాన్ని కూడా బండ బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్... కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ పేరును... రెడ్ బుక్కులో నమోదు చేసుకున్నట్లు సమాచారం.

అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని.. శిక్షించే బాధ్యత మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఇచ్చినట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖ మంత్రి  హోదాలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అటు అక్రమ రేషన్ బియ్యం...  తరలింపు వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అందుకే... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతను నాదెండ్ల మనోహర్ కు ఇచ్చినట్లు సమాచారం.

మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇరికించేందుకు... కాకినాడ లోనే ఉంటున్నారు నాదెండ్ల మనోహర్. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేయించారు. ఆయన అనుచరుల ఇండ్లను కూడా కూల్చే చేస్తున్నారు. అడుగడుగునా  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. ఇటు ద్వారంపూడి రొయ్యల కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇలా... రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇదే పరిస్థితి ఎదురవుతోందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: