•చంద్రబాబును ఉరితీయాలి అన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

•నారా రెడ్ బుక్ లో మొదటి టార్గెట్ ఇతడే

•ప్రతీకారాలకు పోయి ప్రజలను పట్టించుకోవడం మానేస్తారా..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఏకంగా 90 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది..ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.. ఆయన ఎమ్మెల్యేగా గెలవకముందు మంగళగిరిలో పాదయాత్ర చేస్తూ ఎలాగైనా సరే ప్రజలతో మమేకమై వారి నమ్మకాన్ని పొందాలని గట్టి ప్రయత్నాలు చేశారు.. అలాంటి సమయంలో ఎంతోమంది వైసిపి నేతలు, మంత్రులు, వైసీపీకి అనుకూలంగా ఉండే ఉన్నతాధికారులు తనకు అడుగడుగున ఇబ్బందులు కలగజేశారు . అంతేకాదు ప్రొఫెషనల్ గా విమర్శించారు కూడా .. తనతో పాటు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఈ క్రమంలోనే ముందుగానే ఊహించుకున్న నారా లోకేష్ అధికారంలోకి వస్తే తనను ఇబ్బంది పెట్టిన వారందరికి చుక్కలు చూపించడానికి ..తనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి కోసం ఒక రెడ్ బుక్ తయారు చేశారు. అయితే ఈ రెడ్ బుక్ లో ప్రధానంగా చేర్చిన పేర్లలో జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పిన్నెల్లి, ద్వారకా పూడిలతో సహా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు కూడా ప్రధమంగా వినిపిస్తోంది.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టిడిపిని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు గత ఏడాది చంద్రబాబు నాయుడు ను ఏకంగా ఉరి తీయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం సృష్టించాయి..  అనంతపురంలో పర్యటించిన ఈయన.. చంద్రబాబు హయాంలోనే కర్ణాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని.. చంద్రబాబు పాలనలో ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురయ్యాయని.. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులకు ఏనాడు అభ్యంతరం చెప్పలేదని.. పైగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచిన చంద్రబాబు నోరు మెదపలేదని వ్యాఖ్యానించారు.


అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపుకు 2011లోనే కోర్టు స్టే ఇచ్చింది.. కానీ దానిని పట్టించుకోలేదని... 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్ రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కూడా తెలిపారు.. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కూడా ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. దీంతో ఇతడి పేరును కూడా నారా లోకేష్ తన రెడ్ బుక్ లో చేర్చారు. అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు వైరల్ అవుతుండడంతో కొంతమంది రాజకీయ విశ్లేషకులు పగ ప్రతీకారాలతో ప్రజల పరిపాలన మానేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: