తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి అయోమయంగా మారిపోతుంది. ఎందుకంటే ఇక ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారు దిగి మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. మరి ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్శ్ చేపట్టగా ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కేకే కడియం శ్రీహరి లాంటి ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా.. ఇక మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో సిట్టింగులు సైతం కారు పార్టీకి గుడ్ బై చెప్పారు.


 అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక కారు పార్టీలో వలసల పర్వం అస్సలు ఆగడం లేదు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీతో ఎంతో మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలో భారీగా చేరికలు ఉంటాయని చెబుతూ ఉండడం.. ఇక బిఆర్ఎస్ శ్రేణులు అందరిలో కూడా గుబులు రేపుతుంది. ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలు కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుకుంటూ ఉండగా.. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ కి షాక్ ఇచ్చారు.


 ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు కారు పార్టీ ఎమ్మెల్సీలు ఇటీవలే ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఈ ఘటనతో అటు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కి బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, దండే విటల్, దయానంద్, బసవరాజు సారయ్య, భాను ప్రకాష్, ఎంగే మల్లేషములకు సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఉదయం నుంచి అమావాస్య ఉండడంతో ఇక అర్ధరాత్రి సమయంలోనే ఇలా రేవంత్ ఇంటికి చేరుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నది తెలుస్తుంది. అయితే వీరి చేరికతో శాసన మండలిలో అటు కాంగ్రెస్ బలం 12 మందికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: