తెలంగాణ రాష్ట్రంలో... వలసల రాజకీయం నడుస్తోంది. గులాబీ పార్టీలో ఉన్న చాలా మంది నేతలందరూ.. జారుకుంటున్నారు. ఒక్కొక్కరు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారు. శుక్రవారం రోజున.. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కెసిఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఇలాంటి నేపథ్యంలో... కెసిఆర్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన... దానం నాగేందర్ ను టార్గెట్ చేసింది బిజెపి.

 

మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. గులాబీ పార్టీలో విజయం సాధించారు దానం నాగేందర్. ఈ సందర్భంగా దాదాపు 67,368 ఓట్లు సాధించి...  కాంగ్రెస్ పార్టీ గాలి ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో జండా ఎగరవేశారు దానం నాగేందర్.  ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రెడ్డి పై 22 వేలకు పైగా మెజారిటీని సంపాదించుకున్నారు దానం నాగేందర్.  

 

వాస్తవానికి దానం నాగేందర్ ముఖం చూసి ఓటర్లు ఎవరూ కూడా ఓటు వేయలేదు. కేవలం గులాబీ పార్టీ అలాగే కేసీఆర్ ముఖం చూసి ఓటు వేశారు. అయితే అలాంటి దానం నాగేందర్.. గులాబీ పార్టీ నుంచి... కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దానం నాగేందర్ చేరిన తర్వాత వరుసగా వలసలు పెరిగాయి. అయితే ఇప్పటికే దానం నాగేందర్ పై... అనర్హత  పిటిషన్ వేసింది గులాబీ పార్టీ. అయితే దానం నాగేందర్ విషయంలో... గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది.

 

ఎలాగైనా దానం నాగేందర్ పై...  సస్పెన్షన్ వేటు వేయాలని స్పీకర్కు కూడా ఫిర్యాదు భారతీయ జనతా పార్టీ. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ దానం నాగేందర్ పై వేటు పడితే... కచ్చితంగా... అక్కడ ఉప ఎన్నిక వస్తుంది.ఈ నేపథ్యంలో... మొన్న లోక్సభ ఎన్నికల్లో బిజెపికి దాదాపు ఆ నియోజకవర్గంలో భారీగా ఓట్లు పడ్డాయి. అలాగే ఖైరతాబాద్ బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి  చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అందుకే అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎలాగైనా బిజెపి కైవసం చేసుకోవాలని.. దానం నాగేందర్ ను టార్గెట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp