నారా లోకేశ్ రెడ్ బుక్ లో ప్రస్తావించిన ముఖ్యమైన పేర్లలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఒకరని చెప్పవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం ద్వారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు మారుమ్రోగింది. ఆ సమయంలో పొన్నవోలు ఏకపక్షంగా వాదనలు వినిపించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. పొన్నవోలు అడ్వకేట్ అయినా తాను జగన్ కు వీరాభిమానినని పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు.
 
రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిస్పక్షపాతంగా పనిచేయాల్సిన సుధాకర్ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా పని చేయడంతో తనకు పునర్జన్మ ఇచ్చింది జగన్ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్ పిలిచి మరీ ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయిన తనకు అడ్వకేట్ జనరల్ పోస్టు ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు.
 
జగన్ ఏం చెబితే అదే చేస్తానని పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుడిని కాదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఏఏజీ స్థాయి వ్యక్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాసేలా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరుపై నెగిటివ్ కామెంట్లు వినిపించడం గమనార్హం.
 
అయితే పొన్నవోలుపై లోకేశ్ డైరెక్ట్ గా విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ అనే సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ పొన్నవోలును టార్గెట్ చేస్తే ఏ విధంగా టార్గెట్ చేస్తారనే చర్చ సైతం జరుగుతోంది. అప్పుడు స్వామిభక్తిని చాటుకున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రెడ్ బుక్ లో పొన్నవోలు పేరు ఉందని ఇప్పటికే వెల్లడైంది. ఒకవేళ ఆయనను లోకేశ్ నిజంగానే టార్గెట్ చేస్తే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: