సాధారణంగా రాజకీయాల్లో అధికారం చేతులు మారడం సహజం. అయితే అధికారం చేతిలో ఉంది కదా అని ఇస్టారీతిన ప్రవర్తిస్తే మాత్రం ఆ తర్వాత మరో పార్టీ అధికారాన్ని చేపట్టినప్పుడు.. ఓడిపోయిన పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఇక ఇప్పుడు ఆంధ్రాలో వైసిపికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాబోతుందా అంటే పరిణామాలు చూస్తూ ఉంటే అవును అనే సమాధానమే ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


అయితే గతంలో వైసిపి పెట్టిన ఇబ్బందులు అన్నింటికీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రతీకారం తీర్చుకుంటుందా అనే చర్చ ఏపీ రాజకీయాలలో తీవ్రంగానే జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కాస్త ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నికలకు ముందే ఏకంగా ప్రజలతో మమేకం అవ్వడానికి యువగలం  పాదయాత్రను చేపట్టారు లోకేష్. ఆ సమయంలో తనను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలు, అధికారులు, ఉన్నత అధికారుల పేర్లను ఇక రెడ్ బుక్ లో లిస్ట్ గా తయారు చేసానని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లెక్కలు తేలుస్తాం అంటూ లోకేష్ చెప్పారు.


 దీంతో లోకేష్ రెడ్ బుక్కులో ఎవరి పేరు ఉండబోతుంది అనే విషయంపై చర్చ జరుగుతుంది. కాగా  జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి కీలక నేతల పేర్లు ఎలాగో ఉంటాయి. కానీ వీరు కాకుండా ఇంకా ఎవరి పేర్లు ఉంటాయి అనే చర్చ జరుగుతుండగా.. నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పేరు తప్పకుండా రెడ్ బుక్ లో ఉంటుందని ఎంతోమంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా ఎంత పరుషమైన వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తాను ఎమ్మెల్యే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొన్ని కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరు ఏకంగా అభిమానులకు కూడా నచ్చలేదు. అధికారం ఉంది కదా అని ఇక టిడిపి జనసేన నేతలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. దీంతో ఇలా ఇక అధికారంలో ఉన్న సమయంలో రోజా మాటలతో చేష్టలతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. ఇక ఆమె పేరు కూడా లోకేష్ రెడ్ బుక్ లో ఉండే ఉంటుందని ఎంతోమంది అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవలే ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అంటూ అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాపై సిఐడి కి ఫిర్యాదు కూడా అందింది. లోకేష్ రెడ్ బుక్ లో రోజా పేరు ఉండడం కారణంగానే ఇలా కేసు నమోదు అయిందంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో రోజా జైలుకు వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఆంధ్రాలో చర్చించుకుంటున్నారట. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: