• రెడ్‌బుక్‌లో చేరిన వైసీపీ నేతలు ఎవరు

వెల్లంపల్లి శ్రీనివాస్‌ టీడీపీకి టార్గెట్ అయ్యారంటున్న విశ్లేషకులు  

• ఆందోళనలో మాజీ మంత్రి

(ఏపీ - ఇండియా హెరాల్డ్‌)

టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ ఇవ్వగలం ప్రచారంలో రెడ్ బుక్‌ పట్టుకుని తిరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి వ్యతిరేకం చేసిన వారందరినీ రెడ్‌బుక్‌లోకి ఎక్కిస్తున్నా అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి చూస్తామన్నట్లు ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా  రెడ్ బుక్ పై జగన్ చర్చించారు. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, 'లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉంది, చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉంది, ప్రభుత్వంలో అందరికీ రెడ్ బుక్ ఉంది' అని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్కులో ఎవరెవరు పేర్లు ఎక్కి ఉంటాయి? కానీ చాలామంది ఊహాగానాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

అయితే అందులో ఎవరి పేర్లు ఉంటాయి అనేది కచ్చితంగా ఎవరు చెప్పలేరు కానీ గత ఐదేళ్లలో ప్రభుత్వానికి టీడీపీ నేతలకు చెడు చేసిన వారు మాత్రం కచ్చితంగా ఆ పుస్తకంలో ఎక్కే ఉంటారు. వారిలో వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. జగన్ హయాంలో ఆయన ప్రతిపక్ష పార్టీలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌పై దాడి ఘటనలో ఈయన పక్కనే ఉన్నారు. వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారని సెన్సేషనల్ అలిగేషన్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ని ఒక ఆట ఆడుకున్నారు. ఆయనొక ప్యాకేజీ స్టార్ అని, ప్యాకేజీ రావడం వల్లే తొలి విడత వారాహి యాత్రను కంప్లీట్ చేయగలిగారని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బానిస .. ఏ కులమో చెప్పుకోలేని దద్దమ్మ అని దారుణంగా విమర్శించారు

బూటకపు గులకరాయి నాటకంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ బఫూన్ అని టీడీపీ నేతలు ఒకానొక సమయంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వెల్లంపల్లి తెదేపా అధినేత చంద్రబాబుతో టీడీపీ నేత బోండా ఉమాపై కూడా వ్యక్తిగత దూషణలకు తీవ్రమైన ఆరోపణలకు పాల్పడ్డారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకున్నప్పుడు కూడా ఆయన సంచలన కామెంట్లు చేసి లోకేష్ చంద్రబాబు దృష్టిలో పడ్డారు. ప్రత్యర్థులను దెబ్బతీయాలని అమ్మవారిని కోరినట్టు చెప్పి షాక్ ఇచ్చారు. ఇంకా ఆయన యాక్టివ్ గా విమర్శలు చేస్తూ రెడ్ బుక్ లోకి ఎక్కినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: