ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం కూటమి ప్రభుత్వం 164 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని పూర్తిస్థాయి మెజారిటీతో ఉన్నది. ఇదే తరుణంలో  మంత్రివర్గ కూర్పు కూడా ఏర్పడింది. అధినేత చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజా సమస్యల పరిష్కారానికై  ముందుకు సాగుతున్నారు. ఇదే తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను చేయకుండా ప్రజలకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. అలాగే ప్రజాస్వామ్య యుతంగానే మేము పలాన చేస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ అది మాటలకే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. కొంతమంది టిడిపి తమ్ముళ్లు  పార్టీ గెలిచినప్పటి నుంచి  అత్యుత్సాహం చూపిస్తున్నారట. 

అయితే వైసిపి నాయకుల మీద అత్యుత్సాహం చూపిస్తే పర్లేదు కానీ ప్రభుత్వ సర్వెంట్ గా పనిచేసే వారిపై చూపిస్తే మాత్రం అది తప్పే అవుతుంది.  తాజాగా టిడిపి తమ్ముడు టీచర్ పై విరుచుకుపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నంద్యాల జిల్లాలోని  కొలిమిగుండ్ల  మండలం కోర్ణపల్లి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో  ప్రభుత్వ ఉపాధ్యాయుడు  వెంకటేశ్వర్లుపై  బూతులు తిడుతూ రెచ్చిపోయాడు టిడిపి నేత విజయ్ భాస్కర్ రెడ్డి. అయితే రేషన్ బియ్యం బస్తాలని స్కూల్లో స్టోర్ చేయనివ్వడం లేదని దీనికి ఉపాధ్యాయుడు అడ్డుపడ్డాడని ఆయనపై బూతు పురాణం మొదలు పెట్టాడు. మాకు రాష్ట్రంలో 164 సీట్లు వచ్చి పూర్తి మెజారిటీతో ఉన్నాం. మీకు మేం భయపడేది ఏంది. మేము ఏది చెప్తే అది చేయాలంటూ మాట్లాడారు భాస్కర్ రెడ్డి.

ఈ తరుణంలో టీచర్ స్పందించి ఇక్కడ రాజకీయం అవసరం లేదు స్కూల్లో బియ్యం బస్తాలు దింపితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. దీంతో బూతు పురాణం మొదలుపెట్టిన భాస్కర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిట్టారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఇక్కడ ఉండాలనిపిస్తుందా, పోవాలనిపిస్తుందా ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో అన్నట్టు టీచర్ ను మరీ హింసించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  నారా లోకేష్  స్పందించి  కింది స్థాయి  వర్గానికి  హితబోధ  చేస్తారా లేదంటే  సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: