ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ బెంగళూరు పర్యటన నుంచి అమరావతికి తిరిగి వచ్చాక తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నెల్లూరు సబ్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ములాకత్ లో కలిసేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే జగన్ రామకృష్ణారెడ్డిని కలిసేందుకు లోపలికి వెళ్ళినప్పుడు.. బయట ఉన్న వైసీపీకి చెందిన తాజా మాజీ మంత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధ్య ఓ సంభాషణ జరిగినట్టు బయటికి వచ్చింది. ముందు సదరు మాజీ మంత్రి మీ సామాజిక వర్గం వారే మా జిల్లాలను నాశనం చేశారు అనగా.. మాజీ ఎమ్మెల్యే అంతా మీ వల్లే.. మీరే జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని కౌంటర్ ఇచ్చారట.


వెంటనే మాజీమంత్రి నాదేం లేదు.. అంతా మీ వల్ల వల్లే జరిగిందని చెప్పగా.. ఆ మాజీ ఎమ్మెల్యే అసలు ఆమెను రాజమాత అని మీరు ఎందుకు తిట్టారు..? అక్కడ నుంచే కదా మన పార్టీ సర్వనాశనం మొదలైందని ప్రశ్నించారట. వెంటనే మాజీ మంత్రి రాజమాత అంటే అదేమీ తిట్టు కాదు కదా.. మీ వాళ్ళ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని వారిద్దరూ వాదులాడుకుంటూ ఉండగా వెంటనే జగన్ భద్రతా సిబ్బందిలో ఒకరు కలుగజేసుకుంటూ.. ఆ మాజీ మంత్రి ఉద్దేశించి సార్ మీ వల్లే పార్టీకి ఇబ్బంది మొదలైంది.. అందరూ కలిసి పార్టీని ముంచారు అని చెప్పడంతో అక్కడితో ఆ గొడవ సర్దుమణిగింద‌ట.


ఇంతకు రాజమాత అంటే ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక మహిళ నాయకురాలును ఉద్దేశించి అన్నట్టు బయటికి వచ్చింది. ఇంత‌కు ఎవరా రాజమాత..? అని ప్రశ్నించుకుంటే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ వైసీపీ నాయకురాలు ప్రస్తుతం టీడీపీ నుంచి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి.. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


అయితే వైసీపీని వీడిన ప్రశాంతి రెడ్డిని ఆ పార్టీ నేతలు పదేపదే రాజమాత అని సెటైరికల్ గా కౌంటర్లు వేశారు. వాస్తవంగా వేమిరెడ్డి దంపతులకు నెల్లూరు జిల్లాలో మంచి పేరు ఉంది. అందుకే వారిద్దరు విజయం సాధించడంతోపాటు.. టోటల్ జిల్లా మొత్తం మీద వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేశారన్న ప్రచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: