ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి నేతలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వరుసగా టార్గెట్ చేస్తూనే ఉంది. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ... వైసిపి నేతలపై కేసులు కూడా పెడుతోంది. వైసిపి పాలనలో... జనసేన అలాగే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన... నేతలను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ లిస్టులో మొదటి వరుసలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి.

 ముఖ్యంగా నాదెండ్ల మనోహర్... పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  రేషన్ కుంభకోణం  బయటపెడుతున్నారు. కాకినాడ పోర్ట్ ద్వారా తరలిస్తున్న రేషన్ బియ్యం గుట్టు రట్టు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా... కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం... తరలిస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని... పట్టుకునేందుకు... నాదెండ్ల మనోహర్... కాకినాడలోనే ఉంటున్నారు.

 అటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ఇండ్లపై కూడా  దాడులు చేస్తున్నారు పోలీసు అధికారులు. కొంతమంది ఇండ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి సంబంధించిన రొయ్యల కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశారు. ద్వారంపూడి సోదరుడు వీరభద్ర ఎక్స్పోర్ట్సు పేరుతో నిర్వహిస్తున్న రెండు రొయ్యల ఫ్యాక్టరీలలో తనిఖీలు చేశారు జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డ్ అధికారులు.

 ఈ సందర్భంగా పలు నిబంధనలు  కంపెనీ ఉల్లంఘించిందని... ఈ సందర్భంగా రెండు యూనిట్లకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ రొయ్యల ఫ్యాక్టరీ వల్ల పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని... అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేశారట. అలాగే కంపెనీ విస్తరించిన ప్రదేశానికి లోబడి ప్రాసెసింగ్  కార్యకలాపాలు నిర్వహించకుండా.... అంతకుమించి సామర్థ్యంతో కంపెనీ నడుస్తోందట. ఈ తరుణంలోనే దీనిపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపిన అధికారులు... 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కూడా హెచ్చరించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: