గత కొన్ని రోజుల నుంచి  యూకే ఎలక్షన్స్ సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా రిషి సునాక్, సర్ కైరు స్టార్మర్  పోటీ చేశారు. ఇందులో రిషీ సునాక్  కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా,  కైరు లేబర్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోరులో సర్  కైరు స్టార్మర్  ఘనమైన విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది.  మొత్తం బ్రిటన్ లోని 650 పార్లమెంటు సీట్లకు గాను  లేబర్ పార్టీ అభ్యర్థి కైరు స్టార్మర్  410 సీట్లను సాధించినట్లు సమాచారం. ఇప్పటికీ బ్రిటన్ లో జరిగినటువంటి ఏ ఎన్నికల్లో ఇంతటి భారీ మెజారిటీ రాలేదు. 

ఇదే తరుణంలో ఓడిపోయినటువంటి కన్జర్వేటివ్ పార్టీ  అధినాయకుడు మాజీ ప్రధానమంత్రి రిషీ సునాక్  దారుణంగా భావోద్వేగానికి లోనయ్యారు. తన మద్దతుదారులందరికీ ఐయాం సారీ అంటూ  మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో లేబర్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. పార్టీ అధినాయకుడు సర్ కైర్ స్టార్మర్ కు నేను ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేశానని చెప్పాడు. ఈరోజు బ్రిటన్ లో ఒక పద్ధతిలో, శాంతియుతంగానే   అధికారం చేంజ్ అవుతుందని  తెలియజేశారు. నేను ఓడిపోయిన కానీ ప్రజాసేవలో ముందు ఉంటానని అన్నారు.

 ఈ సందర్భంగా స్టార్ మర్ మాట్లాడుతూ.. ఇకనుంచి ప్రజాసేవకు అంకితమై ఉంటానని తెలియజేశారు.  ఈయన హోల్ బోర్న్ అండ్ సెయింట్ పాన్ క్రాస్  అనే స్థానం నుండి  పోటీ చేసి 18884 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించాడు. తాను గెలుపొందిన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి అద్భుతమైన సేవలు చేస్తానని స్టార్మర్ తెలియజేశారు. అంతేకాకుండా బ్రిటన్ ప్రజలంతా  సర్ కైరు స్టార్మార్ కు  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో  రిషి సునాక్ అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. ఆయన గెలుపుతో ఇండియాలో కూడా ఎన్నో సంబరాలు చేశారు. ఎందుకంటే రిషి ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి, ఇక్కడి నుంచే వారు బ్రిటన్ వెళ్లారని  ఇండియన్ వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవ్వడంతో అందరూ సంబరపడ్డారు.  ప్రస్తుతం ఆయన ఓడిపోవడంతో కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: