కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రస్తుతం అష్టదిగ్బంధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి సంబంధించిన 35 వేల టన్నులు రేషన్ రైస్ సీజ్ చేశారట సివిల్ సప్లై అధికారులు. ఇక వాటి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.


కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనుచరులకు చెందిన 8 గోడౌన్లు సీజ్ కాగా...మరి కొన్ని గోడౌన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.  అంతేకాకుండా.... ద్వారంపూడి కుటుంబం నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రెండు రొయ్యల ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఇక ఈ నోటీసులపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులు. వ్యర్థ జలాలను సముద్రంలోకి పంట కాలువలోకి వదులుతున్నారని ఫిర్యాదు చేశారు రొయ్యల ఫ్యాక్టరీ పక్కన ఉన్న గ్రామ ప్రజలు.

ఇక అటు ఈ నెల 2న అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వెళ్లిన తమ విధులకు ఆటంకం కల్పించారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై మున్సిపల్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.  ద్వారంపూడి తో పాటు మరో 24 మంది పై ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కాకినాడ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


అటు ద్వారంపూడి పై కేసు నమోదు కు సంబంధించి స్పందించడానికి నిరాకరిస్తున్న పోలీసులు....ఆయనపై యాక్షన్‌ తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వరుసగా ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిను టార్గెట్‌ చేస్తోంది తెలుగు దేశం కూటమి సర్కార్‌. గతంలో టీడీపీ, జనసేన పార్టీలను బాగా ఇబ్బందులకు కూడా చేశారని  ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి ఓ పేరు ఉంది. ఇక ఇప్పుడు  ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై రివేంజ్‌ తీసుకుంటున్నారన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp