వాళ్ల అన్న ఆసక్తిని యూజ్ చేసుకోవడానికి షర్మిల పెద్ద ప్లానే వేసింది. అసలు విషయంలోకి వెళితే ... ఈ నెల 8 వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఈమె ఎంతో ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఇక ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధి రామయ్య మరి కొంత మంది ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. మీరందరూ కూడా ముఖ్య అతిథులుగా రావడంతో ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినట్లయితే ఈ సభ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈమె కొంత కాలం క్రితం తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కొన్ని రోజులు ప్రచారాలను చేసింది. 

ఇక అక్కడ పార్టీని మూసేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుంది. ఇక్కడ కూడా ఈమె పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమె పెట్టిన సభలకు కూడా పెద్ద స్థాయిలో జనాలు రాలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన జయంతి కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించడం , దానికి ముఖ్యమంత్రులు , వీఐపీలు వచ్చినట్లు అయితే ఆ సభకు పెద్ద స్థాయిలో జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జనాలు వచ్చినట్లు అయితే ఆ సభ సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా షర్మిలకు కూడా మంచి క్రేజ్ వస్తుంది. రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి జయంతి వేడుకలను నిర్వహించడం లేదు. దానితో జగన్ ను తన తండ్రిని చూసి అభిమానించేవారు కూడా షర్మిల వైపు సైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా షర్మిల , జగన్ కి చెక్ పెట్టే ఆలోచనలో ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: