ఎన్నికల ముందుకు వరకు కూటమికి అటు పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా లేఖలు పలువురు నేతలు రాసేవారు.. కానీ ఇప్పుడు కూటమిలో భాగంగా అటు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ కు లేఖ రాజకీయాలు మొదలయ్యాయి. తాజాగా మాజీ ఎంపీ హరి రామ జోగయ్య ఒక లేఖను కూడా రాయడం జరిగింది. ఈ లేఖ రాజకీయంగా మరొక చర్చనీ అంశం కు దారి తీసేలా కనిపిస్తున్నది.


పూర్తిస్థాయిలో రాజకీయ విశ్లేషనత్మకంగా లేఖగా తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా ముందుకు వెళ్తాయని భావిస్తున్నానని.. సంక్షేమ ఫలాల ప్రజలు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప రాజకీయాల లబ్ధి కోసమే ఎవరూ ఉండకూడదని తెలియజేశారు. అలాగే ఒక్క చోటే అభివృద్ధి చేయకూడదని దానిని విస్తరించేలా చేయాలని తెలిపారు.. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను తమ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం జరిగింది హరి రామ జోగయ్య.


కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాపులను బీసీలో చేరుస్తామని అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబు హామీ ఇచ్చిన అది సాధ్యపడలేదని ఇందులో భాగంగానే ఈ కాపు రిజర్వేషన్లు ప్రస్తావని తీసుకువచ్చారని తెలిపారు.. అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలంటూ కోరడం జరిగింది.. సినిమాలు మానేయకుండా కొద్ది రోజులు అటు మిగిలిన రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలంటు సూచనలు కూడా ఇచ్చారు. సినిమాలు కూడా ఎక్కువగా సమాజానికి ఉపయోగపడేవి ఉండేలా చేయాలని తెలిపారు. అలాగే తమకు కేటాయించిన శాఖలను బలోపేతం చేయడానికి చూడాలని హరిరామ జోగయ్య లేఖ ద్వారా తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైనేజీలు రోడ్లు సరఫరా లేని విద్యుత్ సాగునీరుని అందించాలని తెలిపారు. మరి ఇలాంటి వాటిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: