ఏపీలో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయదుందుభి మోగించడంతో సీఎం చంద్రబాబు అనేక సేవల్ని ప్రజలకి అందుబాటులోకి తేవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మొదటగా అన్న క్యాంటీన్లను, డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఆరంభించడం జరిగింది. గత ప్రభుత్వం అయితే వచ్చి రావడంతోనే ప్రజలకు ఎంతో ఉపకరమైన ఈ రకమైన సేవలను నిర్వీర్యం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే జనాలకు ఎంతో ఉపయోగకరమైన సేవలను బాబు ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంలో కార్గో సేవలను తిరిగి స్టార్ట్ చేసినట్టు ఏర్పాటు డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీకాంత రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. ఆక్వా ఉత్పత్తులైనటువంటి చేప, రొయ్యలతో పాటు.... మిర్చి, పండ్లు, పూలు ఇలా అనేక రకాలైన ఉత్పత్తులను తక్కువ ధరలలో పైగా గంటల వ్యవస్థలో దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్గో సేవలను ఒమేగా ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ టెండర్ వేసి దక్కించుకున్నట్టు చెప్పుకొచ్చారు. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ కార్గో సర్వీస్ కూడా స్టార్ట్ చేయడానికి కస్టమ్స్ అధికారులతో మాట్లాడుతున్నట్లు, పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పెన్షన్ దారులకు ఇవ్వాల్సినటువంటి నిధుల మొత్తం 4,400 కోట్ల రూపాయలను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున పెన్షన్ పెన్షనర్లకు అందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఒకసారిగా 7000 రూపాయలు అందడంతో పెన్షన్ దారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేంద్రం కూటమి విషయంలో శుభవార్తలు చెబుతూనే ఉంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్రం ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: