ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్య ప్రజలను కలుస్తున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకొనేందకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. వారి నుంచి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే..పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వారి కారణంగా నిజంగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, వారి కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను పార్టీ నేతలు ప్రకటించారు.ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. అయితే ఇది పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమంగా తెలుస్తోంది. ఈ నెంబర్ ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేయడం విశేషం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఈ వినతులను వినే అవకాశముంది. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలని, ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం వారికి కల్పిస్తామని తెలిపారు పల్లా. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో స్పందన పేరుతో అధికారులు అర్జీలు స్వీకరిస్తుండగా.. కూటమి ప్రభుత్వం కొత్త వెబ్ సైట్ ని తీసుకొచ్చింది. నేరుగా నేతలే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు కొత్తగా మొబైల్ నెంబర్ ని అందుబాటులోకి తెచ్చారు.గతంలో జగనన్నకు చెబుదాం.. అంటూ వైసీపీ ప్రభుత్వం కూడా మొబైల్ నెంబర్ ఏర్పాటు చేసింది. నేరుగా జగనన్నే తమ మాట వింటారేమోనని జనం ఆతృతగా ఫోన్ చేశారు. చివరకు కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ ద్వారా వినతులు స్వీకరించారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబే వారి సమస్యలు పరిష్కరిస్తారని చెబుతూ కొత్త నెంబర్ విడుదల చేశారు. మరి దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. నిజంగా సమస్యల తీవ్రత, వాటి ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం ఇస్తే బాధితులు తమ బాధలు తీరిపోయినట్టు సంతోషపడతారు. త్వరితగతిన సమస్యలు పరిష్కారమైతే ఈ కొత్త ప్రయత్నం సఫలమైనట్టే.అయితే వారి సమస్యల ప్రాధాన్యతను బట్టి... చంద్రబాబును కలిసేలా ప్లాన్ చేస్తామని వివరించారు. అలా ప్రతివారం 500 మంది చంద్రబాబును కలిసేలా...ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా చేస్తే.. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో కూటమి సర్కార్‌ ముందుకు వెళుతుందని.. ఆ దిశగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: