2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా బిజెపి జనసేన టిడిపి పార్టీలో మూకుమ్మడిగా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కట్టుకొని అక్కడే క్యాంప్ ఆఫీసును కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయాలలో ఉన్నంతవరకు ఇదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి వంటి జిల్లాలలో పవన్ ప్రభావాన్ని తక్కువ అంచిన వేయకూడదని ఇటీవల ఎన్నికలలో నిరూపించాయి.


ముఖ్యంగా టిడిపి పొత్తులో ఉన్నప్పటికీ ఇది వారికి చాలా లాభదాయకమని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నంతవరకు గోదావరి జిల్లాలలో వైసిపి పార్టీకి ఎదురీతే అని చర్చ కూడా మొదలయ్యింది. ఇలాంటి పరిణామాల మధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ నేత జగన్తో భేటీ కావడం చర్చినీ అంశంగా మారింది. వైసిపి ఓడిన తర్వాత ముద్రగడ జగన్ని అసలు కలవలేదు.. పైగా ఆ మధ్య ఒక లేఖను విడుదల చేస్తూ తాను అనాధని అని కూడా వెల్లడించారు.


అయితే వైసీపీతో రాజకీయ బంధాలు తెంపుకున్నట్లుగా అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ గోదావరి జిల్లాలలో తిరిగి వైసిపి పార్టీ ఉంచుకోవాలి అంటే కచ్చితంగా కాపుల బలం ఉండాల్సిందే దీంతో ముద్రగడని వైసీపీ వదులుకోరని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవలే వైసిపి ఆఫీసుకు వచ్చిన జగన్తో భేటీ అయి తన వెంట వచ్చిన నాయకులకు సైతం వైసీపీ అధినేతకి పరిచయం చేశారు. ఈ మీటింగ్ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం లోనే కొనసాగింది అని తెలుస్తోంది. ముద్రగడ జగన్ తాజా ఎన్నికల ఫలితాలతో పాటు గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు మీద చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలో జగన్ పర్యటన కూడా ఉండబోతున్నట్లు సమాచారం. పవన్ కి ఎదురు నిలబడే వ్యక్తి ముద్రగడ అన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కాపులకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక కొత్త నాయకుడు లభించారు. మరి ఐదేళ్ల పాలనలో కాపులు సంతృప్తిగా ఉంటే ఆయన వెంట ఉంటారు లేకపోతే కాపుల మద్దతు కోసం వైసిపి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: