ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీకి చెందిన చాలామంది నేతలు , కార్యకర్తలు సైతం చంద్రబాబు వైఖరి పైన ఫైర్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.సుమారుగా 20 రోజులపాటు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక రోజు రోజుకి గొంతు విప్పి మరి కూటమి ప్రభుత్వం పైన వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అందుకు కారణం చంద్రబాబు వైఖరి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్ అంటూ కూడా హెచ్చరించారు.


ఈ వ్యాఖ్యలను విని అటు చంద్రబాబుపైన తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నెల రోజులు కనపడకుండా వెళ్ళిపోయిన జగన్ ఇలా మాట్లాడడంతో చాలామంది నేతలు ఫైర్ అవుతున్నట్లుగా సమాచారం.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినప్పటికీ కాన్వాయ్ ను తీసేయకపోవడంతో కూడా వారికి చాలా అలుసుగా చంద్రబాబు మారారని టిడిపి తమ్ముళ్లు కార్యకర్తలు సైతం ఆయన పైన నిప్పులు జరుగుతున్నారు..


గతంలో వైసీపీ పార్టీ వల్ల చాలా ప్రాంతాలలో అవమానాలు ఎదుర్కొన్నామని తప్పుడు కేసులను ఎదుర్కొన్నామని తమ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని.. కానీ ప్రభుత్వం మారినా కూడా న్యాయం జరగడం లేదనే విధంగా తెలియజేస్తున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత బయటికి వచ్చిన కొడాలి నాని కూడా ఆమధ్య మీడియా ముందు ఫైర్ కావడం జరిగింది నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వడంతో  పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు సైతం చేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని అన్నిటిని కూడా అమలు చేయాలని ప్రజలు వాటి కోసమే ఎదురు చూస్తున్నారంటూ.. ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారనే విధంగా జగన్ మాట్లాడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: