• గెలిపించిన చేతులతోనే జగన్ ను ఓడబెట్టిన వైఎస్ ఫ్యామిలీ 

• తెలియని కారణాలతో సొంత అన్నకే శత్రువైన షర్మిల 

• మళ్లీ అతడి పక్షాన చేరినా నో యూజ్‌ 

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

2019 ఎన్నికల్లో వైఎస్ షర్మిల జగన్ వెంటే ఉండి వైసీపీ కోసం ప్రచారం చేస్తూ ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. బై బై బాబు అంటూ ప్రజల్లో వైసీపీ సునామీని సృష్టించారు. ఆయనకు ఎంతగా సపోర్ట్ చేశారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అయితే 2024 లో జగన్‌కు పూర్తిగా రివర్స్ అయ్యారు. దానికంటే ముందు తెలంగాణ బిడ్డను అంటూ కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయన ఓడిపోయిన తర్వాత మళ్లీ ఆంధ్రాకి చేరుకున్నారు. కిరణ్తో వచ్చిన మనసు పడతారు కారణంగానే ఆమె తెలంగాణలోకి వెళ్లి సీఎం గా పోటీ చేయాలని ప్రయత్నించారు. 

అక్కడి ప్రజలు షర్మిలను కొంచెం కూడా ఆదరించలేదు. ఆమె చంద్రబాబుతో కలిసి జగన్ పైన వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు కోడై కూశారు. బాబు, పవన్‌లపై పెద్దగా విమర్శలు చేయకుండా కేవలం జగన్ పైనే ఆమె నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ తిరిగారు. వైసీపీ నేత అవినాష్ రెడ్డి ఒక హంతకుడు అని అతనికి ఓటు వేయొద్దు అంటూ కడప జిల్లా అంతటా పర్యటించారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో క్రియేట్ చేశారు.  

దాని షర్మిల జగన్ ని ఓడించి తన పంతం నెగ్గించుకున్నారు. 2024లో ఎన్నికల తర్వాత కూడా వీరిద్దరి మధ్య పోరు చల్లారలేదని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ తన అన్నయ్య మీద సానుభూతి చూపి అతనితో మళ్లీ చేతులు కలిపితే ఏమవుతుందనే కోణంలోనూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల మొన్న తన అన్నయ్య మంచోడు కాదు నమ్మొద్దు ఓట్లు వేయొద్దు అని చెప్పారు ఇప్పుడు తన అన్నయ్య మంచోడు ఓట్లు వేయండి అని చెబితే ప్రజలు నమ్ముతారా? ఆమె, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. 

వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పుకుంటూ ఆయనకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. ఆ పార్టీలో కూడా డబ్బు కోసం అక్రమాలకు తెగబడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇంకా ఆమె సొంత అన్నకు ఎదురు తిరగడం కూడా ఆమెపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని తగ్గించే సాయి. ఈ అన్ని కారణాలవల్ల ఆమె జగన్ కోసం మళ్లీ కష్టపడినా ఎవరూ కూడా ఆమె మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు. జగన్‌కు ఆమె వల్ల నో యూజ్‌ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: