-కూటమికి జగన్ భయపడుతున్నారా.?
- ఏ విషయంలో ప్రశ్నించక పోవడం వెనుక అంతర్యం ఏమిటి.?
- ప్రతిపక్ష కర్తవ్యాలు మర్చిపోతున్నారా..?

 వైయస్ జగన్మోహన్ రెడ్డి  రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పట్టుకొని ఎదిగినటువంటి నేత. దాదాపు తన తండ్రి మరణించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు వెళ్లి ఆ తర్వాత పాదయాత్ర చేసి ప్రజల మద్దతు పొంది 2019లో అద్భుత మెజారిటీతో గెలుపొందారు. అలాంటి జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓ స్థాయిలో నిలిపారని చెప్పవచ్చు. రాజకీయ ఉద్దండుడైనటువంటి చంద్రబాబు నాయుడుకే చుక్కలు చూపించినటువంటి వ్యక్తి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది. ఒక్కసారి ఓటమి రాగానే  తట్టుకోలేకపోతున్నారా.?తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోతున్నారా.? చంద్రబాబు ప్రభుత్వాన్ని  ప్రశ్నించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే వివరాలు చూద్దాం..

 ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారా.?
 జగన్మోహన్ రెడ్డి 2019లో  150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అంతేకాదు ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో దాదాపుగా 90% పైగా నెరవేర్చారు. అయినా జగన్ మోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. దీనికి ప్రధాన కారణం ఆయనకు ఉన్నటువంటి అహంకార భావం,  ఒకటైతే  తన చుట్టూ ఉన్నటువంటి నేతలు స్థాయిని మరిచి మాట్లాడడం, పనులు చేయడం. దీంతో ప్రజలు విసుగు చెంది  పూర్తిగా జగన్ ను ఓడించాలనుకున్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డికి మాత్రం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 40 శాతానికి పైగా ఓట్ షేరింగ్ వచ్చింది.. ఒకవేళ చంద్రబాబు కూటమితో కలవకుంటే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డి  విజయం సాధించే వారేమో. ఇంతటి ప్రజా  ఆదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం సైలెంట్ అయిపోయారు. ఆయన సైలెంట్ అయితే ఆయన నమ్మి ఓట్లేసినటువంటి 40 శాతం మంది ప్రజలను మోసం చేసినట్టే అవుతుంది.


జగన్మోహన్ రెడ్డి భయపడకుండా  ప్రభుత్వం చేసే పనుల నుంచి  తప్పులు వెతికి తప్పకుండా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. అయినా ఆయన సైలెంట్ గా ఉంటూ  కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు.  ఈ విధమైన జగన్ వైఖరి చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానమైతే కనిపించడం లేదు. కేవలం సాక్షి మీడియా సంస్థ తప్ప, జగన్మోహన్ రెడ్డి ఏ కోణాల కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే పాలనపై తప్పులు వెతకడం లేదు. ఏ ప్రభుత్వమైనా 100% ప్రజలకు న్యాయం చేయదు.  దాన్ని గుర్తించి ప్రశ్నించడమే ప్రతిపక్ష నాయకులు చేసే పని.  కానీ జగన్ మాత్రం అధికారంలో ఉంటేనే ప్రజల వైపు ఉంటాను. లేదంటే ప్రజల గురించి అవసరం లేదు అన్నట్టు  బిహేవ్ చేస్తున్నారు.  ఇలా ఉంటే మాత్రం రాబోవు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  ప్రజలకు దూరమవుతుందనేది జగన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నించడంలో ఫెయిల్ అయితే జగన్ కూడా రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టే అనేది తప్పక తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: