ఆంధ్ర రాజకీయాల్లో జగన్ కుటుంబ కథ చిత్రం ఎటువైపు వెళ్ళబోతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ప్రశ్నలు ఉన్నాయ్. ఎందుకంటే ఒకప్పుడు వైసిపి పార్టీని నిలబెట్టేందుకు కలిసికట్టుగా పనిచేసిన జగన్, తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఇక ఇప్పుడు ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు అన్న విధంగా మారిపోయింది. దీంతో జగన్ కి అండగా నిలబడాల్సిన కుటుంబం ఇక ఇప్పుడు శత్రువుగా మారింది. ఏకంగా వైసీపీ పార్టీ పతనానికి కారణమైంది. 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన వైసీపీ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది.


 ఇలా అధికారంలో ఉన్న పార్టీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇంత దారుణమైన ఓటమిని చవిచూడటం ఆంధ్ర పొలిటికల్ హిస్టరీ లోనే మొదటిసారి అనడంలో సందేహం లేదు. అయితే మాజీ సీఎం జగన్ కి ఆయన చెల్లెలు షర్మిల కి మధ్య విభేదాలే వైసీపీ పతనానికి కారణమైంది. జగన్ తో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ తర్వాత ఎక్కడో పార్టీ పెట్టడమేంటి తనకు అన్యాయం చేసిన అన్న జగన్నే ఓడిస్తే పోలా.. అనుకుందో ఏమో ఇక తెలంగాణను వదిలి మళ్లీ ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమెకు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు దక్కాయ్. దీంతో ఇక జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది షర్మిల.


 అయితే మరోవైపు తల్లి విజయమ్మ కూడా జగన్ దూరం పెడుతూ కూతురుకు మద్దతు ఇస్తూనే వచ్చింది. ఇలా జగన్ ఫ్యామిలీ విడిపోవడమే ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత జగన్ రియలైజ్ అయ్యి మరో 5 ఏళ్లలో తన చెల్లెలిని తల్లిని మళ్లీ తన వద్దకు చేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. జగన్ షర్మిల కలిసిపోతే ప్రజలు నమ్మగలరా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. మొన్నటి వరకు జగన్ వైసీపీ తరఫున షర్మిల కాంగ్రెస్ తరపున ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకున్నారు. ఒకరి ఓటమిని మరొకరు కోరుకున్నారు. అలాంటిది ఇప్పుడు అన్ని మర్చిపోయి జగన్ షర్మిల కలిసిన.. ప్రజలు మాత్రం వీళ్లను నమ్మే పరిస్థితి లేదు అన్నది ఆంధ్ర రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఇష్టం వచ్చినప్పుడు విడిపోయి.. విమర్శలు చేసుకోవడం.. ఇక కష్టం వచ్చినప్పుడు కలిసిపోవటం.. ఇలా ఏం చేసిన ప్రజలు అన్ని చూస్తూనే ఉంటారు. ఇప్పటికే వైసిపిని నమ్మని ఆంధ్ర ప్రజలు కేవలం 11 సీట్లలో మాత్రమే గెలిపించారు. ఇక ఇప్పుడు షర్మిలను మళ్ళీ కలుపుకుంటే.. ఆ పార్టీని పూర్తిగా నమ్మే ప్రసక్తే లేదు అని రాజకీయ విశ్లేషకు అంచనా వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో  ఆంధ్ర రాజకీయాలలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: