పూర్తిస్థాయిలో జగన్ గురించే రాస్తూ వచ్చేది. దీంతో ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని చెప్పవచ్చు. జగన్ ఉన్నన్ని రోజులు ఈ ఫస్ట్, సెకండ్ స్థానంలోనే ఉండేవి. కానీ జగన్ పార్టీ ఎప్పుడైతే ఓటమి పాలైందో అప్పటినుంచి ఈ ఛానల్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఛానల్ ఉంటుందో, పోతుందో కూడా తెలియలేని పరిస్థితి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి టీవీ చానల్స్ రేటింగ్స్ చూస్తే మాత్రం సాక్షి పరిస్థితి దారుణంగా పతనమవుతోంది. మరి ఆ రేటింగ్స్ లో సాక్షి ఎన్నో ప్లేస్ లో ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏబీఎన్, టీవీ5, ఈ టీవీ పైన బ్యాన్ పెట్టిన వాటిపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ ప్రస్తుతం సాక్షిపై బ్యాన్ పెట్టడంతో దారుణంగా దెబ్బతిన్నది. లేటెస్ట్ రేటింగ్స్ ప్రకారం సాక్షి ఆరో స్థానంలోకి పడిపోయింది. టీవీ9 మొదటి స్థానంలో ఉండగా, ఎన్టీవీ సెకండ్ స్థానంలో ఉండగా టీవీ5 మూడవ స్థానంలో , ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ ఫోర్త్ ప్లేస్, సాక్షిని ఏబీఎన్ క్రాస్ చేసి ముందుకు వచ్చింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే సాక్షి భారీగా పతనమైంది. 10వ స్థానాల్లో సాక్షి నిలిచిపోయింది. ఫస్ట్ ప్లేస్ టీవీ9 సెకండ్ ప్లేస్ v6, టీవీ5, టీ న్యూస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ,ఈటీవీ ఈటీవీ తెలంగాణ, మహాన్యూస్, ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, ఆ తర్వాత సాక్షి టీవీ ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నటువంటి సాక్షి టీవీ బ్యాన్ పెట్టిన తర్వాత దారుణంగా విఫలమవుతూ వచ్చింది. మరి ఈ ఐదు సంవత్సరాలు గడిచేవారికి అసలు సాక్షి ఛానల్ ఉంటుందా ఊడుతుందా అనేది కూడా ఆలోచన చేయాల్సిన విషయం.