ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఓడిపోవడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ కీలక నేతలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వారంతా ఇప్పుడు రాజకీయాలకు మూడు సంవత్సరాల పాటు దూరం కావటం.. లేదా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేయటం చేసే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు ఏలూరు, నరసాపురం సీట్లలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. జగన్ ఈక్వేషన్‌లో అన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. 2019 ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో పాలకొల్లు, ఉండిలో మాత్రమే తెలుగుదేశం గెలిచింది. మిగిలిన అన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.


అయితే ఈసారి పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో మూడు వంతులకు పైగా నేతలు.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులుగా ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, చెరుకువాడ రంగనాథరాజు, గుడాల గోపి, గ్రంధి శ్రీనివాస్, సీవీల్ నరసింహారాజు, కంభం విజయరాజు, ఆళ్ళ నాని, పుప్పాల వాసుబాబు వీళ్లంతా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉందామా అని చాలా వరకు ఆలోచన చేస్తూ ఉండగా.. కొందరు మాత్రం మూడేళ్లపాటు రాజకీయాలను వదిలేసి ఆ తర్వాత పార్టీ పరిస్థితి బాగుంటే అప్పుడు యాక్టివ్ అవ్వవచ్చు అన్న ఆలోచనకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
 

ఐదేళ్లలో పేరుకు మాత్రమే మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నాం తప్ప.. చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు. ఈ ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీని పోషించడం అంటే తలకు మించిన భారం అవుతుందని.. తేడా వస్తే జీవితంలో కోలుకోలేని పెద్ద దెబ్బ పడిపోతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా రిస్క్ చేయటం.. యాక్టివ్ గా ఉండటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్న నిర్ణయానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ వైసీపీ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: