- ఎన్నిక‌ల‌కు ముందు సీట్లు మార్చిన వారంతా పాత స్థానాల కోసం ప‌ట్టు
- కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు.. కొత్త కేడ‌ర్ తో ప‌ని చేయ‌లేమ‌ని గోడు
- జ‌గ‌న్ వీళ్ల మొర ఆల‌కించి ట్రాన్స్‌ఫ‌ర్లు చేస్తాడా ?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు అయ్యాయో లేదో.. వెంటనే యూటర్న్ మంత్రం జపిస్తున్నారు. తమ‌ను తమ పాత నియోజకవర్గాలకు బదిలీ చేయగలరని వేడుకుంటున్నారు. జగన్ ఈ ఎన్నికల్లో చాలామంది స్థానాలు పరస్పరం మార్పు చేశారు. దాదాపు 40 నుంచి 50 మంది నేతలకు నియోజకవర్గాలు మార్చేశారు. గుంటూరు, ప్రకాశం, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో చాలామంది నేతల సిట్టింగ్ స్థానాలను మార్చి వారిని కొత్త నియోజకవర్గాలలో పోటీ చేయించారు.


వారంతా నియోజకవర్గాలు మారిన తర్వాత అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్లే టైం కూడా లేదు. దీంతో అందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇందుకు వారిని తప్పు పట్టలేము. జగన్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత వారిని ఓడించింది. అయితే వీరంతా కొత్త నియోజకవర్గాలు తమకు ఎంత మాత్రం అనుకూలంగా లేవని.. తమను పాత నియోజకవర్గాలకు మార్చేయాలని ఆ నియోజకవర్గాల్లో 20 - 25 సంవత్సరాలుగా తాము పని చేసుకుంటూ కార్యకర్తలతో కలిసి ఉన్నామని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త నియోజకవర్గాల్లో రాజకీయం చేయలేమని వారు వేడుకుంటున్నారు.


ఈ క్రమంలోనే తమ పాత నియోజకవర్గాలకు తిరిగి ఇన్చార్జిలుగా నియమిస్తే కనీసం పాత కేడర్ తో అయినా కలిసి పని చేసుకుంటామని.. అంతకుమించి తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం ఆశించడం లేదని.. ఎన్నికలకు ముందు బదిలీ అయిన నేతలు వాపోతున్నారు. మరి వీరి గోడు సజ్జల రామకృష్ణారెడ్డి , జగన్ పట్టించుకుంటారో..? లేదో..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: