ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటుగా మరికొంతమంది టీడీపీ నేతలపై కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలని తాజాగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవ్వడంతో టీడీపీ వర్గంలో గుబులు మొదలైంది. వీరు మాత్రమే కాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదేవిధంగా వ్యాపార వేత్తలు అయినటువంటి వేమూరు హరికృష్ణ ప్రసాద్‌, లింగమనేని రమేష్ తో పాటు పలు కంపెనీలపై నమోదు చేసిన కేసుల్ని తక్షణమే సిబిఐ చేతికి అప్పగించాలని కోరారు.

మద్యం, ఏపీ ఫైబర్‌ నెట్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, అమరావతి ‌అసైన్డ్‌ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ సహా కేసులు నమోదైనట్టు పిల్‌ దాఖలు చేసారు. ఈ కేసుల్ని నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు కోసం.. సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాల గంగాధర తిలక్‌ ఈ పిల్ దాఖలు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల అనంతరం అప్పుడు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయించారని పిల్‌లో పేర్కొనడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతందని గమనించి.. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

చంద్రబాబు సహా ఇతరులపై నమోదైన కేసుల్లో.. సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల దర్యా­ప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని ఏపీ హైకోర్టును కోరారు తిలక్. ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవ­రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని గుర్తు చేసారు. ఇక తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై రెడ్‌బుక్‌ అంటూ అధికారులను బెదిరిస్తున్నారని, ఈ అంశాలను పరిగణ­నలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని పిల్‌లో హైకోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: