ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య... ఎప్పుడు... వివాదాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు.. నీళ్ల వివాదం, కరెంటు, భద్రాచలంలో ఉన్న ఏడు మండలాల వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర పెద్దలు ఎన్నిసార్లు చర్చించినా కూడా... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదా లు తగ్గడం లేదు. ఇలాంటి నేపథ్యంలో... అమరావతి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా...  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు... తెలంగాణలో కాకుండా హైదరాబాద్ మొత్తం... రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది. తెలంగాణలో ఒక్క ఎకరం కొంటే... ఏపీలో 10 ఎకరాలకు కొనుగోలు చేసేలా పరిస్థితి అప్పుడు ఉండేది. ఇక ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. అమరావతి రాజధాని అని చంద్రబాబు ప్రకటించడంతో... ఏపీలో చాలామంది ల్యాండ్స్ కొనుగోలు చేస్తుంది. దీంతో అమరావతిలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ దందా పెరిగిపోయింది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ మొత్తం... రేట్లు ఎక్కడ పెరగడం లేదు. అసలు భూములు కొనుగోలు చేసిన వారే కనిపించడం లేదు.

ఇలాంటి నేపథ్యం... తెలంగాణలో భూములు కొనుగోలు చేయండి అని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.  అమరావతిలో కొనుగోలు చేసే కంటే... హైదరాబాద్ , హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, ఖమ్మం కరీంనగర్ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. అమరావతి కంటే ఈ ప్రాంతాల్లో భూములు కొంటే... రేట్లు విపరీతంగా తొందరగా పెరుగుతాయని... రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో ఇప్పుడు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: