ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక కార్యక్రమాలలో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం రోజు రోజుకి శృతి మించుతున్నట్లుగా కనిపిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాలో టూరిజం అధికారుల శాఖ మంత్రి కందుల దుర్గే సమీక్షంలో ఒక సమావేశాన్ని సైతం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కూడా పాల్గొనడం జరిగింది. కానీ జనసేన నాయకులు కూడా అధికారి కార్యక్రమంలో పాల్గొనడం పైన విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.


కందుల దుర్గేష్ అలాగే ఆరణి శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యేలు.. కందుల దుర్గేష్ జనసేన నాయకుడు కావడం చేత ఆయనను అక్కడ ఉండే పార్టీ నాయకులు కలవడం పైన ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ మంత్రి ఎమ్మెల్యేలతో పాటు అధికారిక కార్యక్రమంలో పాల్గొని మరి పెత్తనం చేస్తామంటే ఎలా అంటూ అక్కడ ఒక ప్రశ్న మొదలైంది.. పర్యటకశాఖ అధికారులతో సైతం జనసేన అధికారిక ప్రతినిధులు పసుపులేటి హరిప్రసాద్.. కీర్తన వంటి వారు ఫ్రంట్ లైన్ లో నిలబడగా ఈ సమావేశంలోనే వెనుక వరుసలో కిరణ్ రాయల్, ఎస్వీ ప్రసాద్, శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ తోపాటు తదితరులు పాల్గొనడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది.


తిరుపతి ఎమ్మెల్యే అరణి అన్నకుమారుడైన శివకుమార్ కార్పొరేషన్ కార్యాలయాలలో తన పాత్ర పోషిస్తున్నాడని తీవ్రమైన విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తిరుపతిలో జనసేన నాయకుల తీరు మాత్రం మారలేదట. అధికారంలో ఉన్నావని అధికారిక కార్యక్రమాలలో అనధికారకా కార్యక్రమాలలో పెత్తనం చేలా ఇస్తే సహించేది లేదంటూ అక్కడ తిరుపతి వాసులు విమర్శిస్తున్నట్లు సమాచారం. మరి ప్రభుత్వాలపైన గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం ఈ విషయం పైన ఎలా మాట్లాడుతారో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ నిలబడిన పిఠాపురంలో కూడా తన సోదరుడు నాగబాబు ప్రభుత్వాధికారులతో మాట్లాడి అక్కడ సమావేశం అయి వారికి దిశా నిర్దేశాలు ఇస్తున్నారట. మరి ఇలాంటి వాటి పైన అటు టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: