రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్ద కాలంగా పెండింగులో ఉన్న అపరిష్కృత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిం చుకునేందుకు జ‌రుగుతున్న‌ ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. వీటిలో ఎక్కువ‌గా ప‌రిష్క‌రించుకునే ద‌గినవే ఉన్నాయి. అందుకే కేంద్రం ప‌దే ప‌దే మేం జోక్యం చేసుకునేది లేదు. మీరు ఉమ్మ‌డిగా కూర్చుని ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని చెబుతోంది. ఈ నేప‌థ్యం లోఇప్ప‌టికి.. రెండు సార్లు ముఖ్య‌మంత్రులు భేటీ అయ్యారు. అయినా.. ప‌రిష్కారం కాలేదు.


మ‌రి ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు - రేవంత్‌రెడ్డి ల ద్వారా.. ఆయా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా? అనేది ప్ర‌శ్న‌. ఇలా చూసుకుంటే.. రాజ‌కీయ ప‌రమైన ఒత్తిడి ఏపీకంటే కూడా.. తెలంగాణ‌కు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యానికి తోడు.. తెలంగాణ స‌మాజానికి కూడా.. వీటిని ప‌రిష్క‌రిస్తే.. తాము ఎక్క‌డ వెనుక‌బ‌డి పోతామోన‌న్న ఆలోచ‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై నాయ‌కులు పెద్ద‌గా దృష్టి పెట్టడం లేదు.  మ‌రి ఇప్పుడు కూడా అలానే జ‌రుగుతుందా? అనేది ప్ర‌శ్న‌.


అయితే.. ఇప్పుడు అలా కాకుండా.. ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చంద్ర‌బాబు-రేవంత్ చెబుతున్నా రు. దీనికి వారు ఇప్ప‌టికిప్పుడు ఎంచుకునే మార్గం ఒక‌టి ఉంది. అది క‌మిటీలు వేయ‌డ‌మే. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప్రాధాన్యాల వారీగా విభ‌జించి వాటి అధ్య‌య‌నంపై క‌మిటీలు వేసే అవ‌కాశం ఉంది. ఇరు రాష్ట్రాల అధికారుల స‌మ‌క్షంలో ఈ క‌మిటీలు వేస్తే.. కొంత వ‌ర‌కు అధ్య‌య‌నం చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ దిశ‌గానే అడుగులు ప‌డ‌తాయి.


అయితే.. ఇది కూడా.. కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇప్ప‌టికిప్పుడు తేల్చేసే ప‌రిస్థితి లేదు. తెలంగాణ కోరుతున్న తీర ప్రాంతంలో వాటా, తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో వాటా, ఓడ‌రేవుల్లో వాటా, విద్యుత్ బ‌కాయిలు.. వంటివి.. తీరే స‌మ‌స్య‌లు కావు. వీటిని ఇస్తే.. ఏపీలో వ్య‌తిరేక‌త వ‌స్తుంది. సో.. ఎలా చూసుకున్నా.. ఇప్ప‌టికిప్పుడు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. కాబ‌ట్టి.. క‌మిటీలు వేసి.. మ‌రోసారి భేటీ అయ్యేందుకే ముఖ్య‌మంత్రులు ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: