సాధార‌ణంగా..ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఆస్తుల పంపిణీ జ‌రిగితే.. అప్ప‌టి వ‌ర‌కు ఏవైతే.. ఉన్నాయో... లేదా పెద్ద‌లు ఏవైతో.. పంచుకోమ‌న్నారో.. వాటికే ప‌రిమితం అవుతారు. ఇది స‌హ‌జం కూడా. కానీ.. లేని వాటిని.. కూడా పంచుకోవాలంటే.. సాధ్య‌మేనా?  ఇదే.. ఇప్పుడు తెలంగాణ వైఖ‌రి! కొంత బాధ అనిపించ‌వ‌చ్చు. కానీ, తెలంగాణ కోరుతున్న‌వి గొంతెమ్మ కోరిక‌లు అన‌డంలో సందేహం లేదు. కానీ,ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేక పోతున్నారు. ముందు ఆ కోరిక‌లు ఏమిటో చూద్దాం.

1. ఏపీలో కలిపిన పోల‌వ‌రం ముంపు మండ‌లాల(7)ను తెలంగాణలో చేర్చాలి.

వాస్త‌వం ఏంటి:  వీటిని ఆర్డినెన్స్ ద్వారా 2014లో కేంద్రం క‌లిపింది. అప్పుడు అడ్డు చెప్ప‌ని తెలంగాణ మ‌ధ్య‌లో పేచీ పెడుతోంది.

2. ఏపీకి 1000 కిలో మీట‌ర్ల మేర ఉన్న‌ తీరప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి.

వాస్త‌వం ఏంటి:  తీర ప్రాంతం గురించి విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన‌లేదు. పైగా.. తీర‌ప్రాంతం ఉన్న విష‌యం తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనే అంద‌రికీ తెలుసు. అప్పుడు అడ‌గ‌లేదు. మ‌ధ్య‌లో వ‌చ్చింది.

3. తీర ప్రాంత ఓడ‌రేవుల్లో.. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం వంటివాటిలో తెలంగాణకు భాగం కావాలి.
వాస్త‌వం ఏంటి:  దీనిని కూడా విభ‌జ‌న చ‌ట్టంలో చెప్ప‌లేదు. మ‌ధ్య‌లో వ‌చ్చిన డిమాండ్‌. ఇవి ఎలా ఇస్తార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

3.  తిరుపతి శ్రీవారి ఆల‌యంలో తెలంగాణ‌కు కూడా భాగం కావాలి.

వాస్త‌వం ఏంటి:  దీనిని కూడా విభ‌జ‌న చ‌ట్టంలోపేర్కొన‌లేదు. అయినా.. ఆల‌యాల్లో భాగం ఇవ్వ‌డం కుద‌ర‌దు. పైగా.. ఇది తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో కూడా లేదు.

4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్‌ మెంట్‌ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి.

వాస్త‌వం ఏంటి:  భార‌త దేశ జ‌లాల వివాదానికి బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ ఉంది. దీని ప్ర‌కార‌మే జ‌లాల్లో వాటా వ‌స్తుంది. కానీ, అంత‌ర్జాతీయ పంపిణీ సూత్రాన్ని తెలంగాణ కోరుతోంది. ఇది కూడా సాధ్యం కాదు.

5. తెలంగాణకు కృష్ణాన‌దిలో 558 టీఎంసీ నీటిని కేటాయించాలి.

వాస్త‌వం ఏంటి:  కృష్ణాన‌దిలో నీటిని ఇప్ప‌టికే 299 టీఎంసీల వ‌ర‌కు తెలంగాణ‌కు కేటాయించారు. ఇంత‌కు మించి ఇస్తే.. ఏపీ ఎడారి అవుతుంద‌ని బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ స్ప‌ష్టం చేసింది.

5. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఏపీ విద్యుత్‌ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. సత్వరమే చెల్లించాలి.
వాస్త‌వం ఏంటి:  ఎందుకు ఎలా బ‌కాయి ఉన్నాయో.. వివ‌రించ‌డం లేదు. వివ‌రించినా.. అవి విభ‌జ‌న చ‌ట్టంలో లేవు. ఎందుకంటే.. ఉమ్మ‌డి ఏపీలో కొన్ని సంవ‌త్స‌రాల పాటు వాడిన క‌రెంటుకు నిధులు కోరుతున్నారు. కానీ, 2014 త‌ర్వాత మాత్ర‌మే బ‌కాయిల విష‌యాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్నారు.

6. ఆంధ్రాకు విద్యుత్ బ‌కాయిలు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని నెమ్మ‌దిగా చెల్లిస్తాం.

వాస్త‌వం ఏంటి? :  ఏపీకి 2014-15 మ‌ధ్య తెలంగాణ వాడిన క‌రెంటుకు సంబంధించి 5700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి ఇవ్వ‌కుండా అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగ‌డ‌.

ఈ డిమాండ్లు ఎప్పుడు వ‌చ్చాయి.?

తెలంగాణ కోరుతున్న పై డిమాండ్లు ఏవీ కూడా.. విబ‌జ‌న చ‌ట్టంలో లేవు. అయిన‌ప్ప‌టికీ.. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారును ఇరుకున పెట్టే ఉద్దేశంతో అప్ప‌టి కేసీఆర్ ప్ర‌బుత్వం ఈ డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చింది. వీటి కోస‌మే విభ‌జ‌న చ‌ట్టంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం కాకుండా నిలువ‌రిస్తున్నారు. కానీ, ఇవి తీర్చ‌డం సాధ్యం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: