దేశంలో బాగా వెనకబడిన అభివృద్ధి చెందని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు. అలాంటి రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. ఆ రాష్ట్రంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో ఏకంగా మొత్తం 828 మంది స్టూడెంట్స్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త యావత్ భారత దేశాన్నే షాక్ కి గురయ్యేలా చేస్తుంది.అందులో ఇప్పటికే 47 మంది స్టూడెంట్స్ మృతిచెందడం బాధాకరం. అందులో 572 మంది బతికే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, పెరుపొందిన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు త్రిపుర నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్లడం జరిగింది. దాంతో ఈ వార్త తెలీడంతో పక్క రాష్ట్రాలు కూడా వణుకుతున్నాయి.త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా యువత డ్రగ్స్ బానిసలు అవుతుండటంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు ఇంకా యూనివర్సిటీల్లో అధ్యయనం చేపట్టారు.


ఈ క్రమంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్‌ కి బానిసలు అయ్యారు. అందువల్ల వారు విచ్చల విడిగా డ్రగ్స్ ఇంజక్షన్స్‌ తీసుకుంటున్నట్లుగా అధికారులు తమ విచారణలో ఈ షాకింగ్ విషయాన్ని గుర్తించడం జరిగింది. అయితే అన్ని వందల మందికి ఇంత భయంకరమైన హెచ్ఐవీ పాజిటివ్ రావడానికి కారణం hiv ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజక్షన్ మరొకరు వాడుతుండటంతో ప్రతిరోజు ఏకంగా 5 నుంచి 7 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అక్కడ అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ ఘటన చాలా దారుణం అనే చెప్పాలి. బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఇలా తప్పుద్రోవ పట్టడం వారి జీవితాలని సర్వ నాశనం చేసుకోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. రాజకీయ నాయకులు, అధికారులు అవినీతికి పాల్పడకుండా ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే త్రిపుర విద్యార్థులకు ఈ దుస్థితి వచ్చుండేది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: