ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ  దాదాపుగా నెల రోజులు పూర్తి కావోస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సెక్స్ హామీలను అమలు చేసే విధంగా పలు రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. చాలా తలనొప్పిగానే మారింది. ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమ పథకాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చాలా ఇబ్బందులుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా డీఎస్సీ పైన మొదటి సంతకం పింఛన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు అన్న క్యాంటీన్లు ఏర్పాటు తదితర అంశాలను సైతం నెరవేర్చారు.


అయితే ఇప్పుడు తాజాగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన రైతు భరోసా పథకాన్ని పేరు మారుస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాది కి 20వేల రూపాయలు అందించబోతున్నారు. గత ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి 13500 చొప్పున అందిస్తూ ఉండగా ఇందులో పిఎం కిసాన్ నుంచి 6000 ఇస్తూ ఉండేది.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా 20 వేలకు పెంచింది.


దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు ఏకంగా పెంచింది. పిఎం కిసాన్ కింద 6000 చొప్పున అన్నదాతలకు అందించబోతున్నారు. ఏడాదికి మూడు విడుతల ఈ పెట్టుబడి సహాయాన్ని చంద్రబాబు అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పథకం పొందడానికి అర్హతల విషయానికి వస్తే.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.. రైతులు ఆధార్ కార్డు , భూమి పత్రాలు, ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు ఆదాయ పత్రము మొబైల్ నెంబర్ ఉండాలట. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి పోర్టల్ని కూడా ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: