2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక విడిపోతున్న సమయంలో విభజన చట్టం కింద కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది. కానీ ఇచ్చిన కొన్ని హామీలు మాత్రం ఇప్పటి వరకు అమలు కాలేదు. దానితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కి ఒక లేఖను రాశారు. అందులో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది.

విభజన హామీలు ఇంకా కొన్ని నెరవేరలేదు. మీకు ఇష్టం ఉన్నట్లు అయితే జులై 6 వ తేదీన మనిద్దరం కలిసి వాటిపై చర్చిద్దాం అని ఒక లేఖను రాశారు. ఇక దానిపై ప్రతి స్పందించిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ... చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖను చదివాను. ఆయన చెప్పినట్లుగానే జులై 6 వ తేదీన కలిసి విభజన హామీల గురించి చర్చిద్దాం అని సూచించారు. ఇక చెప్పిన విధంగానే తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి విభజన హామీలపై చర్చించారు.

అందులో భాగంగా రేవంత్ రెడ్డి విభజన సమయంలో భద్రాచలం నుండి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణలో మళ్ళీ తిరిగి కలపాలి అని సూచించినట్లు తెలుస్తోంది. ఆ అనంతరం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ని హైదరాబాదులో కొన్ని భవనాలను అడిగినట్లు తెలుస్తోంది. ఇక దీనికి రేవంత్ రెడ్డి స్థిరాస్తులను ఇచ్చే ప్రసక్తే లేదు అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి సమావేశం కొనసాగుతుంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అనే విషయం మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: