ఏదో సామెత చెప్పినట్టు ఏపీలో కూటమి గెలవాలనే కోరిక కంటే వైసీపీ ఓడిపోవాలనే లక్ష్యంతో ఎక్కువమంది కృషి చేయడంతో 2024 ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మధ్యకు రావడానికి కార్యకర్తలతో మమేకం కావడానికి ఆసక్తి చూపని జగన్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మారుతున్నారు. తాజాగా జగన్ వైసీపీ కార్యకర్తలు, ప్రజలను పలకరించడంతో పాటు వాళ్లతో ఫోటోలు దిగారు.
 
మరోవైపు చంద్రబాబుపై విమర్శల ఘాటు పెంచారు. మరోవైపు కూటమి నేతలు తమకు భారీ మెజార్టీ రావడానికి జగన్ కారణమని తేల్చి చెబుతున్నారు. జగన్ భారీ తప్పిదాలే ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెంచి తమ పార్టీ గెలవడానికి కారణమయ్యాయని వెల్లడిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ కామెంట్లు చేశారు. జగన్ చేసిన తప్పుల వల్లే 20కు పైగా నియోజకవర్గాల్లో కూటమికి భారీ మెజార్టీలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
 
తమ పార్టీ అభ్యర్థులకు 90000కు పైగా మెజారిటీలు రావడానికి జగన్ పరోక్షంగా కారణమని ఆయన వెల్లడించారు. అనుభవం లేని జగన్ గత ఐదేళ్లలో లెక్కకు మిక్కిలి పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే ఛాన్స్ వచ్చినా జగన్ సద్వినియోగం చేసుకోలేదు. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు సైతం కూటమి వశం కాగా జనసేన సాధించిన స్థాయిలో కూడా వైసీపీకి ఫలితాలు రాలేదు.
 
మాజీ సీఎం టీడీపీ నేతలు చేసిన కామెంట్లను గుర్తు పెట్టుకుని ముందుకు అడుగులు వేయాల్సి ఉంది. వైసీపీ నుంచి గెలిచిన నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కూటమి ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. వైసీపీ పుంజుకునే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా జగన్ అడుగులు పడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను జగన్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. జగన్ ఇప్పటికైనా సరైన సలహాదారులను ఎంచుకుంటే పరిస్థితులు కొంతమేర మారే అవకాశాలు అయితే ఉంటాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: