ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు ఎంతో కాలం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దగ్గర పని చేశాడు. ఇక చంద్రబాబు కూడా ఈయనకు ఆయనతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. దానితో ఈయన తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా మారాడు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ను కలపనున్నాడు. మరి సాధారణ నాయకుడిగా కెరియర్ను మొదలుపెట్టిన రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును కలవనున్నాడు. మరి ఆయన జీవితం రాజకీయాల్లో ఎక్కడ నుండి స్టార్ట్ అయింది... ఎక్కడ వరకు వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్‌ 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేసి 2018 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఆ తరువాత 2018 లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. ఆయన 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

రేవంత్‌ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రేవంత్ 2021 జూన్ 26 న తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా నియమితుడయ్యాడు. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. రేవంత్‌రెడ్డి 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సిఎల్పీ నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా జెడ్పిటిసిగా కెరియర్ను మొదలుపెట్టిన రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నాడు. ఇక ఈయన తెలుగుదేశం పార్టీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇతనికి మంచి ప్రాముఖ్యతను ఇచ్చాడు.

ఇక రెండు రాష్ట్రాలు విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిపార్టీ గొప్ప స్థాయిలో లేని సమయంలో ఎన్నో ప్రణాళికలను వేచి కాంగ్రెస్ పార్టీని ఎంతో గొప్ప స్థాయికి తీసుకువచ్చాడు. ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో తన గురువు అయినటువంటి చంద్రబాబును కలిశాడు. ఇక వీరిద్దరి మధ్య ఎన్నో చర్చలు ఈ రోజు జరిగాయి. వాటన్నిటికీ సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా చాలా కాలం ఉన్నా కూడా సరికొత్త సవాళ్లు ఈ సారి అతనికి ఎదురవుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. దానితో వీరిద్దరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం జనాలలో ఏ మాత్రం నెగిటివ్ కాకుండా చూసుకుంటున్నారు. మరి వీరిద్దరి భేటీ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేరకు సహాయపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: