బొబ్బిలి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా సుజయ కృష్ణా రంగారావు 2004 నుంచి వరుసగా మూడుసార్లు మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఆయన సోదరుడు అయినా RVSKK రంగారావు  వల్ల టిడిపిలో నుంచి మంచి విజయాన్ని సైతం అందుకున్నారు. బొబ్బిలి ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల పలు నియోజవర్గాలలో కూడా టిడిపి పార్టీ విజయానికి కృషి చేశారని తెలుస్తోంది. బొబ్బిలి రాజా వంశీయులు కావడం చేత వీరికి ఆ ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. దీంతో ఈయనకు పదవి కూడా వస్తుందని అందరూ అనుకున్నారు.



కానీ తీరా చూస్తే పదవి రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇటీవలే ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ టిడిపి నేత తనలో ఉండే బాధని సైతం బయట పెట్టడం జరిగింది. అయితే ఈయన చెప్పిన మాటలు విని అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. మంత్రి పదవి రాని విషయంలో కార్యకర్తలు అభిమానులు సైతం అధికార పార్టీ పైన ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలియజేయడం జరిగింది.


రంగారావు మాట్లాడుతూ  తాను బొబ్బిలికి రాకముందే చెన్నైలో ఉండే వాడినని రాజకీయాలు మీద ఇంట్రెస్ట్ ఉండడంతో బొబ్బిలికి వచ్చానని.. కానీ తన తల్లిదండ్రులు మాత్రం తన చదువు సాగదని తను బొబ్బిలికి రావడానికి ఒప్పుకోలేదట.. తాను బొబ్బిలిలో బాగా చదివి డిగ్రీ పూర్తి చేస్తానని తన తల్లి నీ ఒప్పించి మరి తీసుకువచ్చానని కానీ ఇక్కడికి వచ్చి చిన్న వయసులోనూ రాజకీయాలలోకి రావడం వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయానని తెలిపారు.. కొండపల్లి శ్రీనివాస్ ఇతర దేశాలలో చదివాడు కాబట్టే మంత్రి అయ్యారు.. తాను డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి మంత్రి కాలేకపోయానని తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు. ఆరోజు తన తల్లి మాట విని ఉంటే ఈరోజు మరొక లాగా ఉండేవాడిని అంటూ తెలిపారు. అందుకే చాలామంది చదువుకోవాలని ఉద్దేశంతోనే పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: