- ప్రాంతాలు పార్టీలు వేరైనా ఇద్దరు ఒకటే.
- తెలంగాణలో బాబు లాంటి పాలనే..!
- రాష్ట్రాల అభివృద్దే ఇద్దరి లక్ష్యం..!

నిను వీడని నీడను నేనే, దోస్త్ మేరా దోస్త్ తుహి మేరే జాన్.. ఇలా పాత స్నేహ బంధాన్ని మళ్లీ ముందుకు తీసుకువచ్చారు   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఇద్దరు గురు శిష్యులు ఒకప్పుడు టిడిపి జెండా కింద ఎదిగిన వారే. అప్పట్లో ఇద్దరు ఏ పని చేసినా  అనుకొని చేసేవారు. అలాంటి గురు శిష్యులు రాష్ట్ర విభజన తర్వాత  కాస్త దూరమయ్యారు. అంటే కిలోమీటర్ల పరంగా దూరమయ్యారు తప్ప వారి మనసులు మాత్రం ఒకటే. పాలనపరంగా  రేవంత్ రెడ్డి చంద్రబాబుని అనుసరిస్తున్నారని చెప్పవచ్చు. అలా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అంచలంచెలుగా ఎదుగుతూ  ప్రస్తుతం వీరు రాష్ట్రాలకు సీఎంలుగా ఎన్నికయ్యారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు..ఎన్నో సమస్యలు చవిచూశారు..చివరికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేసి  మొదటిసారి కలిసి మీటింగ్ పెట్టారు. మరి అలాంటి వీరి మధ్య బంధం ఎలా కొనసాగింది ఎలా కొనసాగబోతోంది అనే వివరాలు చూద్దాం..
 
 ఓటుకు నోటు  కలయిక:
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య స్నేహం అనేది హైదరాబాదు నుంచి మొదలైంది. అప్పటి నుంచి మొదలైన ఈ జర్నీ లో ఇద్దరూ కలిసి ఎన్నో పదవులు అధిరోహించారు. చివరికి ఓటుకు నోటు కేసులో కూడా ఇద్దరు ఇరుక్కున్నారు. ఇలా వచ్చిన ఆటుపోట్లు అన్నింటిని ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ విధంగా గురువు చంద్రబాబు నీడలో  శిష్యుడు రేవంత్ రెడ్డి ఎంతో రాజకీయ అనుభవాన్ని పొందాడు. ఎత్తుకు పైఎత్తులు వేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఇలా ఎన్నో అంశాలపై చంద్రబాబు వెంట ఉంటూ నేర్చుకోగలిగాడు. అలా చంద్రబాబు నమ్మిన బంటుగా మారిన రేవంత్ రెడ్డి రాష్ట్రాల విభజన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. విభజన తర్వాత కూడా కొన్నాళ్లపాటు టీడీపీలో కొనసాగినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఈయనతో పాటు సీతక్క ఇతర టిడిపి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ అయితేనే  బాగుంటదని భావించి అందరూ ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  రేవంత్ రెడ్డి దూకుడు చూసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడిగా  పదవి ఇవ్వడంతో  రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో కొత్త ఊపు తీసుకొచ్చారు.  కాకలు తిరిగిన రాజకీయ నాయకుడు అయినటువంటి  కేసీఆర్ ను పడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. అలాగే గురువు చంద్రబాబు కూడా కూటమితో జతకట్టి  వైసిపి పార్టీని పూర్తిస్థాయిలో పడగొట్టి 2024 లో ఏపీ లో అధికారంలోకి వచ్చారు. నిజంగా ఇద్దరు గురు శిష్యులు  ఒక ప్లాన్ ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు రాష్ట్రాల అభివృద్ధి ఏ విధంగా చేయాలి. విభజన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి. ప్రాంతాలు రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అనే భావనను ప్రజల్లో తీసుకువచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: