ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య దాదాపుగా 15 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అంచెలంచెలుగా ఎదిగి చంద్రబాబు రేవంత్ రెడ్డి తమ లక్ష్యాలను సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదుల సంఖ్యలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. కేసీఆర్, జగన్ గతంలో ఈ సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపలేదు.
 
అయితే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని చంద్రబాబు రేవంత్ భావన అని తెలుస్తోంది. అయితే చంద్రబాబు రేవంత్ భేటీ కావడంతో ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీ.ఆర్.ఎస్ విమర్శల దాడిని మొదలుపెట్టాయి.
 
ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే విధంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కొన్ని అలివి కాని డిమాండ్లను లేవనెత్తిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉందని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించకుండా బాబు, రేవంత్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
 
అదే సమయంలో చంద్రబాబు, రేవంత్ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సవాళ్లు పునరావృతం కాకుండా ఉండేలా ఉంటే మంచిదని చెప్పవచ్చు. సానుకూల చర్చ ద్వారా మాత్రమే ఇరు రాష్ట్రాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు, రేవంత్ కొత్త సమస్యలను క్రియేట్ చేయకుండా ఉంటే చాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నాదమ్ములలా కలిసి ఉండాలని చాలామంది ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే. విభజన వల్ల ఏపీ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఆ నష్టాన్ని వీలైనంత వేగంగా పూడ్చితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: