* రేవంత్‌ పై కేసీఆర్‌ కేసులు
* ఓటుకు నోటు కేసులో రేవంత్‌ ఉక్కిరి-బిక్కిరి
* కూతురి పెళ్లి సమయంలో రేవంత్‌ అరెస్ట్‌
* కాంగ్రెస్‌ పెద్దల ఆశీర్వాదం


తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి... అద్భుతంగా రాణిస్తున్నారు. ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీ ల పేరుతో... ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... కెసిఆర్ లాంటి పెద్ద నాయకుడిని ఓడించారు. 10 సంవత్సరాల పాటు పాలించిన... కెసిఆర్  కోటలు బద్దలు కొట్టి మరి ముఖ్యమంత్రిగా...  రేవంత్ రెడ్డి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ... కెసిఆర్ ను ఓడించడం మాత్రం రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే అయింది.


అయితే కెసిఆర్  ను ఓడించేందుకు గడిచిన 10 సంవత్సరాలుగా  రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ.. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఓటుకు నోటు కేసులో  రేవంత్ రెడ్డి దొరికిపోయిన సందర్భంగా...ఆయనను అరెస్టు చేయించారు కేసీఆర్.


ఆ సమయంలో ఫోన్ టాపింగ్ చేసి మరి రేవంత్ రెడ్డిని దొరికేలా... స్కెచ్ వేశారు. అయితే ఆ ట్రాప్ లో పడిపోయిన రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చి... కెసిఆర్ పై పోరాటం చేయడం అలాగే కొనసాగించారు. అయితే రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు అడుగడుగున కేసీఆర్... అడ్డంకి గా మారారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ తగ్గలేదు.


ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులుగా  బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపించారు. 6 గ్యారంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీని...  అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అనేక కష్టాలు పడ్డ రేవంత్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఓ ఆట ఆడుతున్నారు. గులాబీ పార్టీని.. టిడిపి తరహాలో క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: