•రేవంత్ - చంద్రబాబు కలయిక రాష్ట్రాలకు మంచిదేనా

•గురుశిష్యుల మజాకా

•రాష్ట్రం సుభిక్షమే ప్రధాన లక్ష్యం..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా రాజకీయంలోకి వచ్చిన తర్వాత గురు శిష్యులుగా మారిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ ఇటీవల హైదరాబాదులోని ప్రజాభవన్ లో సమావేశం అయ్యారు.  ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కలయిక కారణంగా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా మారనున్నాయి అని.. ప్రజలు సైతం విశ్వసిస్తున్నారు. ఇక వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు  కేసీఆర్..  ఇక ఈయనను ఎవరూ ఢీకొట్టలేరని తెలంగాణ కేసీఆర్ అడ్డా అని అందరూ అనుకున్నారు.. తెలంగాణ కెసిఆర్ అడ్డా అనే కంచుకోటని సైతం పగలగొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు.

మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో వైసిపి బాగా బలపడిన నేపథ్యంలో వైసీపీని ఢీకొట్టలేదని అందరూ అనుకున్నారు.. కానీ చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఓట్లు చీలకుండా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి వైసిపి పార్టీని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ గురు శిష్యులు కాస్త ముఖ్యమంత్రి హోదాలను సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరూ ఎలాగైనా సరే రెండు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతామని.. తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.. ఇక అందులో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు జరిగాయట. దీంతో ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఇప్పుడు ఈ సమావేశం ద్వారా కలిగింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..

అంతేకాదు విభజన అంశాలపై అధికారుల కమిటీని వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.. ముఖ్యమంత్రులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలు మరొకసారి కూర్చొని చర్చిస్తారని.. ఏడు మండలాలు.. విద్యుత్ బకాయిలు ఇలా ప్రతి అంశంపై అధికారులు కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.. ముఖ్యంగా అప్పటికి పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళ్దామని కూడా ఇందులో ముఖ్యమంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. పైగా ఎటువంటి సమస్య వచ్చినా సరే వాటిలోనే పూర్తి చేస్తామని.. ఇకపై ఎటువంటి అంశాలు పెండింగ్లో ఉండవు అని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.. ఇక తాజాగా అందుతున్న సమాచారాలను బట్టి చూస్తే ఇకపై అటు ప్రజలకు ఇటు రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ఢోకా ఉండదు అని స్పష్టం అవుతుంది. మొత్తానికి అయితే గురుశిష్యుల ఆత్మీయత కారణంగా రెండు రాష్ట్రాలు సుభిక్షం కానున్నాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: