రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి సీఎం కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి సీఎం అయ్యారు. మరోవైపు 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవడం కష్టమని అందరూ భావించగా 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని సంచలన ఫలితాలను సొంతం చేసుకుంది.
 
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్నో వివాదాలు కేసుల్లో చిక్కుకున్నా వాటిని అధిగమించడంతో వీళ్లిద్దరూ పడి లేచిన కెరటాలు అని నెటిజన్ల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో సైతం సత్సంబంధాలు ఉండటం ఈ ఇరువురు నేతలకు బలం అయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
చంద్రబాబు నాయుడు అనుభవంతో ఏపీని అద్భుతంగా పాలిస్తుండగా రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను, హామీలను చెప్పిన విధంగా అమలు చేస్తూ ప్రజల మెప్పు పొందారు. రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ ఇద్దరు నేతలు పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు. ఏపీ, తెలంగాణ యువతకు మేలు చేసేలా ఈ ఇద్దరు నేతలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
 
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎన్నికలలో సాధించిన సంచలన ఫలితాలతో విమర్శలు చేసేవాళ్ల నోర్లు మూయించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఎంతో ముందుచూపు ఉన్న నేతలు అని చెప్పవచ్చు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. చంద్రబాబు, రేవంత్ నిర్ణయాల విషయంలో ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. గురు శిష్యులు రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండటంతో భవిష్యత్తులో కొత్త సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: