ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో... కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్... దాదాపు రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా... ఈ కేసులో ఇరుక్కుని చిప్పకూడు తింటున్నారు. కల్వకుంట్ల కవిత కూడా ఇదే కేసులో... జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.


అయితే ఇలాంటి నేపథ్యంలో... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భర్త సునీత...  తన భర్త అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు... మాగుంట శ్రీనివాసులు... కారణంగానే తన భర్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయ్యాడని సంచలన ఆరోపణలు చేశారు సునీత. మాగుంట శ్రీనివాసులు ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్ కారణంగా... అధికారులు తన భర్తను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీని వెనుక అతిపెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. తన కుమారుడు రాఘవను  కాపాడుకునే క్రమంలో... మా గుంట ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి తన భర్తను ఇరికించాడు అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆ స్టేట్మెంట్ తన భర్త మెడకు చుట్టుకుందని... ఆయనను పోలీసులు అరెస్టు చేసేదాకా వచ్చిందని తెలిపారు. వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీతిపరుడు అని... ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.


ప్రస్తుత పరిస్థితులలో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రజలు మద్దతు ఇవ్వకపోతే... తన భర్త లాగా చదువుకున్న వారు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావడానికి భయపడతారని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు కొడుకు రాఘవ... గత సంవత్సరమే అరెస్టు అయ్యాడు. అతనికి బెయిల్ కూడా వచ్చింది. అయితే వైసీపీ నుంచి...  టిడిపిలోకి వచ్చిన మాగుంట... ఎంపిక కూడా గెలవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: