ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటినుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు , నాయకులు ఎక్కువ శాతం కేంద్రాన్ని అడుగుతున్న కోరికలలో ప్రత్యేక హోదా ప్రధమంగా ఉంది. కాకపోతే 2014 నుండి అడుగుతున్న ఇప్పటి వరకు వారి కోరిక నెరవేరలేదు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రత్యేక హోదా కోసం కాస్త పోరాడిన అది పాలించలేదు. ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ప్రయత్నించాడు.

అది సక్సెస్ కాలేదు. ఇక 2024 లో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం , జనసేన , బిజెపి లతో పొత్తు పెట్టుకోవడం , అలాగే ఇక్కడ పొత్తులో భాగంగా ఈ కూటమికి పెద్ద ఎత్తున అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు రావడం , ఇక చూస్తే బీ జే పీ కి దేశం మొత్తంలో భారీ స్థాయిలో ఎంపీ స్థానాలు రాకపోవడంతో కచ్చితంగా తెలుగు దేశం పార్టీపై ఆధారపడవలసిన అవసరం బి జె పి కి వచ్చింది. దానితో చాలా మంది ఇదే చంద్రబాబు కు కరెక్ట్ సమయం. బి జె పి కి ఎక్కువ బలం లేదు. ఈ సమయంలో ప్రత్యేక హోదా అడిగితే కచ్చితంగా ఇస్తారు అని అంత చెప్తూ వచ్చారు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆయనను మీడియా వారు మీరు ప్రత్యేక హోదా అడుగుదాము అనుకుంటున్నారా ..? బీహార్ వాళ్ళు అడిగారు కాబట్టి అడిగే ఉద్దేశం ఉందా ..? అనే ప్రశ్నను అడిగారు. దానితో చంద్రబాబు చాలా తెలివిగా మేము ప్రత్యేక హోదా అడగడం లేదు. అంతకుమించిన వసతులను మేము పొందుతున్నాం అని సమాధానం ఇచ్చాడు. ఇకపోతే చాలా మంది మేధావులు కూడా ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మరికొన్ని రాష్ట్రాలు కూడా అవే డిమాండును కేంద్రం ముందు ఉంచుతాయి. అలా ఇస్తూ పోతే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుంది. అందుకే ప్రత్యేక హోదా కాకుండా వేరే పేరుతో అంతకుమించిన వసతులను కేంద్రం కల్పిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదనను చాలా మంది సూచిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: