ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇప్పుడు రియల్ భూమ్.. ఒక రేంజ్ లో నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మామూలుగా ఒక ప్రాంతానికి కంపెనీలు వస్తేనో..? లేదా రింగు రోడ్లు మంజూరు అయితేనో..? లేదా పారిశ్రామిక ఓడలు వస్తేనో..? భూమి రేట్లు పెరుగుతాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ రియల్ భూమి రావటం అనేది పిఠాపురం విషయంలోనే మొదటిసారిగా జరిగింది. ఇది నూటికి నూరు శాతం నిజం. పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తన పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్నది లీక్ అయిందో.. అప్పటి నుంచి పిఠాపురంలో రియల్ ఎస్టేట్‌కు ఒక్కసారిగా ఊపు వచ్చింది.


పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే.. ఇది మరింత ఊపందుకుంది. ఇక పిఠాపురంలో పవన్‌ ఎన్నికల ప్రచారం చేయటం.. పవన్ గెలుస్తాడన్న అంచనాల నేపథ్యంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే అక్కడ భూముల రేట్ల‌కు రెక్కలు వచ్చేసాయి. ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల మధ్యలో పలికింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవటం.. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో పిఠాపురంలో భూముల రేట్ల‌ను ఆపే పరిస్థితి లేకుండా పోయింది. పిఠాపురంలో కనివినీ ఎరుగ‌ని రీతిలో రియల్ భూమి ప్రారంభమైంది.


కాకినాడ, రాజమండ్రి తో పాటు తుని, విశాఖపట్నంకు చెందిన ప్రముఖ రియల‌ట్ల‌ర్లు అందరూ పిఠాపురంలో వాలిపోయి భూములు కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కచ్చితంగా ఈ ఐదేళ్లలో పిఠాపురాన్ని కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తారని.. అక్కడకు భారీగా కంపెనీలు తీసుకురావడంతోపాటు.. సముద్రమార్గం ఉండడంతో పలు రంగాల్లో అభివృద్ధి చేస్తారన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ రియల్ భూమ్ మామూలుగా లేదని ప్రచారం జరుగుతోంది. రేట్లు ఒక రేంజ్ లో పలుకుతుంటే.. భూములు కొనేవాళ్ళు భారీగా ఉన్నా... అమ్మే వాళ్ళు మాత్రం ఇష్టపడటం లేదు. ఈ ఐదేళ్లలో అక్కడ రేట్లు డబుల్ అయిపోతాయన్న అంచనాలు వచ్చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: