ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.... వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... జగన్మోహన్ రెడ్డికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. విశాఖలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్మించిన భవనాలపై టిడిపి దుష్ప్రచారం చేస్తుంటే... అటు వైసిపి కార్యాలయాలకు నోటీసులు కూడా అంటిస్తున్నారు. అంతేకాకుండా వైసిపి పాలనలో ఫైర్ బ్రాండెడ్ గా ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ... కేసులు కూడా పెడుతున్నారు.


అలాగే.. వైసిపి పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో... కొంతమంది జగన్మోహన్ రెడ్డి  తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నారు. ఇందులో వైసీపీ నేతలు కూడా ఉండటం గమనార్హం.  ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా... జగన్మోహన్ రెడ్డి తప్పిదాలను ఎత్తిచూపారు. అయితే తాజాగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పై తిరుగుబాటు చేశారని చెప్పవచ్చు.


తాజాగా మీడియాతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ... జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజావేదికను కూల్చడం తప్పే అంటూ బాంబ్‌ పేల్చారు కరణం ధర్మ శ్రీ. ప్రజా వేదిక రేకుల షెడ్డు, నింబదనలకు విరుద్ధంగా కట్టారు.... అయినా కూల్చడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ పరంగా కట్టిన నిర్మాణాలు తొలగించడం నేను తప్పుగానే భావిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు కరణం ధర్మ శ్రీ.  తెలిసో తెలియకో చేసిన తప్పుకు ప్రజలు కక్ష కట్టి ఓడించారని వెల్లడించారు.

ఇప్పుడు తెలుగు దేశం కూటమి ప్రభుత్వం వైసీపీ ఆఫీసులు భూ స్థాపితం చెయ్యాలని చూస్తోంది..ఈ కక్ష సాధింపు విధానాలను ప్రజలు అంగీకరించరని ఆగ్రహించారు కరణం ధర్మ శ్రీ. అంతేకాదు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కారణమంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గమైన చోడవరంలో... BN రహదారిపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కానీ ఆయన నా మాట వినలేదని... ఫలితంగా తానువు ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టు తెలిపారు. ఇలా చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డికి చెబితే వినలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: