ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ఫ్యామిలీ అంటే ఎంతటి గుర్తింపు ఉందో మనందరికీ తెలుసు. అలాంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి  ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎం కాగలిగారు. అయితే ఆయన రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మొదటిసారి పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి వచ్చినప్పుడు ఆయన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఎంతో సపోర్ట్ చేసి సీఎం అయ్యే వరకు వెంటే ఉన్నారు. కానీ సీఎం అయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించారు. తన చెల్లికి రావాల్సిన ఆస్తులలో మొండి చేయి చూపించారు. అలాగే తల్లి విజయమ్మను కూడా ఇబ్బందులకు గురి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి ఇదే ఫ్యామిలీ నుంచి వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి రాగా జగన్ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.

 అన్నా చెల్లెళ్లు  పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికీ సమాధానం చెప్పలేక విజయమ్మ పరాయి దేశం వెళ్లిపోయింది. ఇదే తరుణంలో ఆమె షర్మిలకు సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా చివరికి జగన్ మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు.  దీంతో షర్మిల అనుకున్నది చేయగలిగింది.  ఇక రెండవ టార్గెట్ ఆమె కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాలి. తన తండ్రి  ఆశయాలను నెరవేర్చాలి అనుకుంటుంది. దీంతో జూలై 8వ తేదీన తండ్రి జయంతి  సందర్భంగా  ఆమె రాజశేఖర్ రెడ్డి జయంతి  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. దీనికోసం ఏఐసీసీ పెద్దలందరిని పిలిచింది. ఇదే తరుణంలో జగన్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇద్దరు పోటా పోటీగా జయంతి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అయితే ఈ జయంతికి రమ్మని విజయమ్మని కూడా ఆహ్వానించిందట.

అయితే విజయమ్మ కూడా షర్మిల నిర్వహించే జయంతికి మాత్రమే వెళ్ళనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకుకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదని, కూతురినే రాజకీయాల్లో లేపాలని విజయమ్మ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జయంతికి విజయమ్మ హాజరు  అవ్వనున్నట్లు సమాచారం.  ఒకవేళ విజయమ్మ జయంతికి వస్తే మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందని చెప్పవచ్చు. చూడాలి విజయమ్మ వస్తుందా.. లేదంటే కొడుకు మాట ప్రకారం సైలెంట్ గా ఉంటుందా.?లేదంటే కొడుకు ఇటు బిడ్డ ఇద్దరు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరవుతుందా..అనేది  జులై 8న తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: