వైయస్ కుటుంబానికి కడప అంటే కంచుకోటగా ఉండేది.. అయితే ఈసారి ఎన్నికలలో కడపలో కూడా చాలా సీట్లు వైసిపి పార్టీ ఓడిపోవడం జరిగింది. దీంతో తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో అలాగే కడప ప్రాంతాలలో కూడా పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. పులివెందుల నియోజవర్గం లింగాల మండలం కోయన్నూతులకు చెందినటువంటి నరేంద్ర అనే అబ్బాయి నీటిలో పడి మరి ప్రాణాపాయస్థితికి చేరుకున్నారట. అయితే పక్కనే ఉన్న నరేంద్ర సన్నిహితులు సైతం 108 వాహనానికి ఫోన్ చేసి పిలిపించారు.



అయితే ఆ 108 వాహనం సకాలంలో రాకపోవడంతో సన్నిహితులు నరేంద్ర ద్విచక్ర వాహనం పైన పులివెందుల ఆసుపత్రికి సైతం తీసుకు వెళ్తూ ఉన్నారు..మరొకవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని సైతం పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఆగి చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడారట.. అయితే ఈ సమయంలో బైక్ పైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ నరేంద్ర ను తీసుకువచ్చారు ముఖ్యంగా 108 కి ఫోన్ చేసినా రాలేదని కనీసం కాన్వాయ్ లో ఉన్నటువంటి 108 వాహనాన్ని ఆ బాధితుడిని తరలించి ప్రాణాలు కాపాడాలని కోరగా..



ఈ విషయం పైన వైయస్ జగన్ వరకు చేరగా ఆ వెంటనే తన కాన్వాయ్ లో ఉండే 108 అంబులెన్స్ ని నరేంద్ర అనే అబ్బాయి దగ్గరికి పంపించి మరీ ఆసుపత్రికి తరలించారు. అలా హుటా హుటిగా 108 లో ఉన్న ఆక్సిజన్ తో పులివెందుల మెడికల్ కళాశాలకు బాధితుని తీసుకువెళ్లారట.. అలా సకాలంలో వైయస్ జగన్ సహాయం చేయడం వల్ల అలాగే వైద్యులు కూడా వెంటనే చికిత్సకు సహకరించడం వల్ల నరేంద్ర ప్రాణాలు కాపాడుకోగలిగారు తల్లిదండ్రులు. అలాగే 108 కు ట్రాఫిక్ క్లియర్ చేసి మరి ప్రాణాలు కాపాడిన జగన్ కు మరొకసారి అక్కడ ప్రజలు రుణపడి ఉంటామంటూ తెలియజేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలలో మాత్రం ఉంటానని చెప్పారు జగన్ .అలాగే చేస్తూ వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: