* రుణమాఫీని పరిచయం చేసిన హీరోగా వైయస్సార్
* రైతుల పాలిట దేవుడిలా మారిన రాజశేఖర్ రెడ్డి
* ఉచిత కరెంటు, రుణమాఫీతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎదుగుదల



ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి... ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయన అమలుపరిచిన... ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైయస్సార్ తీసుకువచ్చిన చాలా పథకాలను ఇప్పటికి కూడా అమలు చేస్తున్నాయి.


అయితే దేశానికి... అన్నం పెట్టే రైతన్నను మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు మరువలేదు. నిత్యం రైతుల కష్టసుఖాలను తెలుసుకుంటూ... వారి కోసమే చాలా పథకాలను తీసుకువచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఇందులో రుణమాఫీ ప్రక్రియ ఒకటి. ఏకకాలంలో... రెండు లక్షల వరకు కూడా రుణమాఫీని... చేసి... మొనగాడిగా నిలిచాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అంతేకాదు...  రుణమాఫీ ప్రక్రియను పరిచయం చేశాడు వైయస్సార్.


చంద్రబాబు పాలనలో...  రైతులు అప్పట్లో చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ఆ ప్రభుత్వాన్ని.. దించేందుకు రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ , ఉచిత కరెంటును కూడా ప్రకటించారు వైయస్సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నారు. దీంతో అప్పటినుంచి ప్రతి ప్రభుత్వం రుణమాఫీ ఇవ్వడంతో పాటు ఉచిత కరెంటును కూడా అమలు చేయాల్సి వచ్చింది.


ఇలా రైతుల పట్ల దేవుడిగా మారాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసిన తర్వాత మళ్లీ.. అలాగా ఏకకాలంలో ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయారు. మొన్న.... కెసిఆర్ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేక... ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అటు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని... అధికారంలోకి వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి సరసన చేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr