•రైతుల పాలిట ఆత్మబంధువు

•తన చేతలతోనే ప్రత్యర్ధులకు చుక్కలు

•మాట తప్పని మడమ తిప్పని మహానేత వైయస్ఆర్>>

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.. వైయస్సార్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ రాజకీయ నాయకులు.. 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన 1989, 1991, 1996 మరియు 1998 ఎన్నికలలో కడప నుండి లోకసభ కు ఎన్నికయ్యారు..ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏకంగా ఆరుసార్లు ఎన్నికయ్యారు.. పులివెందుల నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో కూడా విజయం సాధించి అక్కడి ప్రజల మన్ననలు చూరగొన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఒక రాజకీయ నాయకులు అని చెప్పడం కంటే ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో దేవుడు అని చెప్పవచ్చు.. రూపాయి కే వైద్యం తీసుకువచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చి సంచలనాలు సృష్టించారు ...పేదవారికి ఉచితంగా వైద్యాన్ని అందించి.. గొప్ప మనసు చాటుకున్నారు. వాస్తవానికి ఈయన వృత్తిరీత్యా డాక్టర్ కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రాజకీయాలలోకి వచ్చి అంతకుమించి పేరు ఘడించారు.


వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే పేదల పాలిట దేవుడే కాదు రైతుల పాలిట ఆత్మబంధువు కూడా.. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా రైతుల గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ వైయస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఆయన సమకూర్చారు.. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు.. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు.. వైయస్సార్  ఉచిత విద్యుత్ ప్రకటించిన సమయంలో బట్టలు ఆరవేసుకోవడానికి ఉచిత విద్యుత్తు అంటూ హేళన చేశారు.. కానీ అదే పథకాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ను అందించారు. అప్పట్లో ఉచిత విద్యుత్తు ఎంతలా రైతులలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పంటలు పండించుకొని రైతులు రారాజులయ్యారు. వర్షాల కోసం ఎదురు చూస్తూ.. విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచారు.

అంతేకాదు ఈయన ప్రవేశపెట్టిన పథకాలు మరెన్నో ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా తీసుకొచ్చిన ఘనత ఈయనది.. ఈయన తీసుకొచ్చిన ఈ పథకంతో ఎంతోమంది ఉన్నత విద్యను చదువుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మరొకవైపు రాజకీయ రంగాలలో కూడా మంచి ప్రావీణ్యం పొందారు. ఇలా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా దానిని నెరవేర్చిన ఘనత ఈయన సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: