వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన చనిపోయి చాలా ఏళ్ళే అవుతుంది. కానీ ఇంకా పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని  దేవుడులా కొలువు తీరారు ఆయన. వైయస్సార్ పేరు వినిపించిందంటే రైతులు కళ్ళు చెమరిస్తూ ఉంటాయి. ఎందుకంటే రైతుల జీవితాలను మార్చిన గొప్ప నాయకుడు ఆయన  రైతుల కష్టాలను అర్థం చేసుకున్న మహా నాయకుడు వైయస్సార్. పేద ప్రజలకు అండగా ఉండేందుకే తాను సీఎం అయ్యాను అన్న విషయాన్ని ఆయన పాలనలో ప్రవేశపెట్టిన ప్రతి సంస్కరణలో కూడా నిరూపించుకున్నారు.  ఇలా అద్భుతమైన పాలనతో ఏకంగా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్రణ వేసుకున్నారు వైయస్సార్.


 ఉచిత విద్యుత్, గ్రామీణ ఆరోగ్య భీమా, ఉచిత అంబులెన్స్ సేవ, గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ గృహాలు, సబ్సిడీ బియ్యం, వెనకబడిన వారికి కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్, రైతులందరి కోసం జలయజ్ఞం ప్రాజెక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాలనలో పేదలు, రైతుల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని ఇన్ని కావు. ఈ సంస్కరణల్ని సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. అయితే నేడు వైయస్సార్ 75వ జయంతి. దీంతో తెలుగు ప్రజలందరూ కూడా మరోసారి  గుండెల్లో గుడి కట్టుకున్న ఆ దేవుడిని స్మరించుకుంటున్నారు. 2009 సెప్టెంబర్ రెండవ తేదీన ఇక వైయస్సార్ హెలికాప్టర్ పేలిన ఒక గుండెలు పిండేసే ఘటనని కూడా గుర్తు చేసుకుంటున్నారు.


 ఇలా జననేతగా జనం హృదయంలో గుడి కట్టుకున్న రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్న వైయస్సార్ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతము షర్మిల, జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ఒకప్పుడు వైసీపీ పార్టీ గెలుపు కోసం షర్మిల, జగన్ పనిచేసినప్పటికీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో జగన్ వైసీపీలో ఉంటూ శత్రువులుగా మారిపోయారు. దీంతో పెద్దాయన బ్రతికుంటే ఇదంతా జరిగేది కాదని ఎంతోమంది వైయస్ కుటుంబ అభిమానులు అనుకుంటున్నారు.



  పెద్దాయన ఉండుంటే తన కొడుకు జగన్, కూతురు షర్మిల కి కాంగ్రెస్ లోనే  సముచిత స్థానం వచ్చేలా చేసే వారిని.. పెద్దాయనే బతికుంటే జగన్ కాంగ్రెస్ ను వీడి వైసిపి అనే కొత్త పార్టీని పెట్టేవారు కాదని.. పెద్దాయనే బ్రతికుంటే ఇక అన్న చెల్లెల మధ్య గొడవలు వచ్చేవి కాదని.. పెద్దాయనే బ్రతికుంటే తెలుగు రాజకీయాల్లో వైయస్ కుటుంబం ఒక అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగేదని.. ఇలా పెద్దాయనే బ్రతికుంటే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి జగన్ వైసిపి పార్టీ పెట్టడం, వైసిపి నుంచి షర్మిల బయటకి వచ్చి వైయస్సార్టిపి పార్టీని పెట్టడం, మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం.. ఇక విజయమ్మ కొడుకును కాదని కూతురుకు మద్దతు ఇవ్వడం.. వైయస్సార్ కుటుంబం మొత్తం విడిపోవడం.. ఇలాంటివేవి జరిగేది కాదని.. ప్రస్తుత పరిణామాలు చూసి వైఎస్ కుటుంబ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ysr