తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. చాలామంది గులాబీ పార్టీ నేతలు పార్టీలు మారడం జరుగుతుంది. పొద్దున లేచి చూసేసరికి... ఏ నేత ఎక్కడ ఉంటున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను గులాబీ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ కు... అదే తరహాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ పార్టీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు నాయుడు కలకలం రేపారు. తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు... తెలుగుదేశం పార్టీని మళ్లీ తెలంగాణలో లేపే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన గంట తర్వాతనే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు...  నారా చంద్రబాబు నాయుడు ను ప్రత్యేకంగా కలవడం జరిగింది.


గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు, తదితరులు నారా చంద్రబాబు నాయుడు ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో... తెలుగుదేశం పార్టీలో గులాబీ పార్టీలు చేరబోతున్నారని వార్తలు అందుకున్నాయి. గతంలో చంద్రబాబు పార్టీలోనే ఈ నేతలు పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్లు మళ్లీ... అదే పార్టీలోకి వెళ్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.


వాస్తవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా... గులాబీ నేతలు ఆయనను కలిసి అభినందించారట. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు బొకేలు ఇచ్చి... శుభాకాంక్షలు తెలిపారుట గులాబీ నేతలు.  కానీ సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో మాత్రం వారందరూ పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా గతం లో టిడిపి పార్టీ ని కేసీఆర్ కూడా ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ చాలా బలంగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS